సినిమాల్లో హీరోయినవ్వాలనొస్తే.. సీరియల్స్ లో విలనయ్యింది.. అందాల ఆరబోతకి మాత్రం

ఈ మధ్య సీరియల్స్ లో నటించే వాళ్ళని కూడా పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కర్ణాటక నుండి దిగుమతి అయ్యే అమ్మాయిల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చాలా సీరియల్స్ లో నటించే హీరోయిన్లు ఎక్కువ శాతం కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చినవాళ్లే. హీరోయిన్లు, విలన్లు అన్నీ వాళ్ళే. అయితే ఒక తెలుగమ్మాయి మాత్రం ఈ మధ్య ఓ సీరియల్ తో హాట్ టాపిక్ అయిపోయింది.

Gayathri Simhadrii

చూడటానికి ఆమె చాలా చక్కగా కనిపిస్తుంది కూడా. విషయంలోకి వెళితే.. బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘కార్తీక దీపం’ సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి సీక్వెల్ గా ‘కార్తీక దీపం- ఇది నవ వసంతం’ పేరుతో సీక్వెల్ రూపొందింది. అది కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

 వాస్తవానికి ‘కార్తీక దీపం’ సీరియల్ సక్సెస్ అవ్వడానికి మూల కారణం మౌనిత అనే విలన్ పాత్ర చేసిన శోభా శెట్టి. కానీ ‘కార్తీక దీపం- ఇది నవ వసంతం’ సీరియల్ కి ఆమె దూరమైంది. ఆమె ప్లేస్ లో గాయిత్రి సింహాద్రి అనే అమ్మాయిని తీసుకున్నారు. సీక్వెల్లో విలన్ జ్యోష్న పాత్ర ఈమె పోషిస్తుంది. ఈమె కన్నింగ్ లుక్స్, విలనీ స్మైల్ అన్నీ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈమె ఏ సీన్లో కనిపించినా సరే.. ‘లాగి పెట్టి కొట్టాలనేంత’ నేచురల్ గా నటిస్తుంది. సీక్వెల్ కి హైలెట్ అంటే ఈమె రోల్ అనే చెప్పాలి. అయితే ఈమె కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందాల ప్రదర్శన చేస్తుంది. అలా అని ఈమె కూడా పక్క రాష్ట్రాల నుండి వచ్చిన అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఈమె పక్కా తెలుగమ్మాయి. విజయవాడకి చెందిన ఈమె హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చింది.

‘మ్యాడ్’ వంటి సినిమాల్లో గుర్తింపు లేని పాత్ర చేసింది. కానీ గుర్తింపు వచ్చింది అయితే ‘కార్తీక దీపం- ఇది నవ వసంతం’ సీరియల్ వల్లనే అని చెప్పాలి.

ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus