విక్టరీ వెంకటేష్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీల్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. ఈ సినిమాలో పింకీ పాత్రతో పాపులర్ అయ్యింది సుదీప. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తర్వాత ఈమెను ఎక్కువ శాతం పింకీగానే గుర్తుపెట్టుకున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ తర్వాత ఈమె ‘బొమ్మరిల్లు’ ‘స్టాలిన్’ ‘బిందాస్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ నటించింది. బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో కనిపించింది.
2012 ఆ టైంలో సుధీప శ్రీరంగనాథన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లోనే నివసిస్తూ వస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఈమె ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.
అటు తర్వాత సుదీప సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ కనిపించింది లేదు. ఫ్యామిలీ లైఫ్ నే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. సుదీప పెళ్ళైన 13 ఏళ్లకు తల్లయ్యింది. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో బేబీ బంప్ తో ఓ డిఫరెంట్ ఫోటో షూట్ చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత అంటే రీసెంట్ గా ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా ఆమె ఫాలోవర్స్ అంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా సుదీప తన భర్త,బిడ్డతో కలిసి ఓ స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో తన కొడుకు ఫేస్ రివీల్ చేసింది. సుదీప బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. మీరు కూడా ఒక లుక్కేయండి