సినిమాలే కాకుండా ఇప్పుడు థియేటర్లు కూడా నిర్మాణ సంస్థల స్టేటస్‌కి ప్రతీకగా మారాయి. ఓ మంచి సినిమా కంటెంట్ ఎంతైనా కీలకం, కానీ దానికి సరైన ప్రదర్శన వేదిక ఉంటేనే ప్రేక్షకుడి అనుభవం మరో లెవెల్ లో ఉంటుంది. అందుకే, స్టార్ నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలో అడుగుపెడుతున్నాయి. ఈ జాబితాలో లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ (Geetha Arts) కూడా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అరవింద్ (Allu Aravind) నేతృత్వంలోని ఈ సంస్థ, నరసరావుపేటలో ‘గీతా మల్టీప్లెక్స్’ పేరుతో థియేటర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
మార్చి 28న ఓపెనింగ్‌కు సిద్ధమైన ఈ మల్టీప్లెక్స్, మూడు స్క్రీన్‌లతో, అత్యాధునిక సౌండ్ అండ్ విజువల్ సిస్టమ్‌తో రూపొందించబడింది. ప్రత్యేకంగా 4K డాల్బీ ఆప్టిమైజ్డ్ అట్మాస్ టెక్నాలజీతో ప్రతి స్క్రీన్‌ను తీర్చిదిద్దారు. కాసు సెంట్రల్ మాల్‌లో స్థానం ఏర్పరచుకోవడం వల్ల, ఆ ప్రాంత ప్రజలకు సినిమా అనుభూతి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఇది ఒక క్లాస్ థియేటర్ అనుభూతిని మాస్ వీక్షకులకు అందించే ప్రయత్నంగా చెబుతున్నారు మేకర్స్.
ఇప్పటికే ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ వంటి సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లతో మార్కెట్‌ను ఆక్రమించగా, ఇప్పుడు గీతా ఆర్ట్స్ కూడా ఆ కేటగిరీలోకి వచ్చేసింది. అయితే ప్రత్యేకత ఏంటంటే, చిన్న పట్టణాల్లో కూడా హై ఎండ్ థియేటర్లు అవసరమన్న విభిన్న దృష్టికోణాన్ని ఈ సంస్థ అనుసరిస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటి వరకు ప్రొడక్షన్‌లో ఎంతో స్పెషలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్‌లోనూ అదే క్వాలిటీని రిప్లికేట్ చేయాలని చూస్తున్నాడు.
ఫ్యామిలీ, యూత్, మాస్ ప్రేక్షకులకు అన్నింటికీ సరిపోయే విధంగా గీతా మల్టీప్లెక్స్‌కి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లౌంజ్, ఫుడ్ బుకింగ్ ఫెసిలిటీలూ ఉంటాయని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ఒక చిన్న టౌన్‌కి మాత్రమే పరిమితం కాకుండా, ఇది రానున్న కాలంలో గీతా ఆర్ట్స్ థియేటర్ విస్తరణకు ఓ ప్రారంభ సంకేతం అని చెప్పొచ్చు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే మరిన్ని మల్టీప్లెక్స్‌లతో గీతా ఆర్ట్స్ ముందుకు సాగే అవకాశముంది. నరసరావుపేటతో మొదలైన ఈ జర్నీ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని స్టెప్స్ వేస్తుందో చూడాలి.