ఈ మధ్య ఏ సెలబ్రిటీ అయినా విడాకులు తీసుకుంటున్నారు అనేది అంచనా వేయాలంటే.. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తే సరిపోతుంది. వాటిలో కపుల్స్ తమ పార్ట్నర్ ఫోటోలు డిలీట్ చేశారు అంటే.. వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నట్లు క్లారిటీ వచ్చేసినట్టే అని సోషల్ మీడియా బ్యాచ్ భావిస్తుంది. నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) , ధనుష్(Dhanush) – ఐశ్వర్యకు (Aishwarya) .. వంటి కపుల్స్ విడాకుల వార్తలు మొదలైంది ఇలానే. చివరికి వాళ్ళు నిజంగానే విడాకులు తీసుకోవడం జరిగింది.
అయితే సోషల్ మీడియాలో మరికొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా ఫోటోలు వంటివి డిలీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు విడాకులు తీసుకోలేదు. కానీ ఆ కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరగడంతో.. కంగారుపడి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ లిస్టులో తాజాగా సీనియర్ హీరోయిన్ భావన (Bhavana) కూడా చేరింది. గోపీచంద్ తో (Gopichand) ‘ఒంటరి’ (Ontari), నితిన్ తో ‘హీరో’ , శ్రీకాంత్ తో (Srikanth) ‘మహాత్మ’ (Mahatma) వంటి సినిమాలతో ఈమె తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది.
మలయాళ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సరైన హిట్టు పడకపోవడం వల్ల.. తెలుగులో ఆఫర్లు రాలేదు. కొన్నాళ్ల తర్వాత నిర్మాత నవీన్ రమేష్ ను ఈమె పెళ్లాడింది. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ జీవితం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల ఈమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్తతో దిగిన ఫోటోలు లేకపోవడం వల్ల.. ఈమె విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై ఆమె స్పందించి వెంటనే క్లారిటీ ఇచ్చింది.
కొద్దిరోజుల నుండి నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది. నా భర్తతో నేను విడిపోయాను అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నా భర్తతో దిగిన ఫోటోలు నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. నా ప్రైవసీ నాకు ముఖ్యమని భావిస్తాను. మేము కలిసున్నామని చెప్పడానికి సెల్ఫీలు తీసుకుని పెట్టాల్సిన అవసరం లేదు.నేను ఇప్పుడు నా భర్తతోనే సంతోషంగా జీవిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది భావన.