టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతామాధురికి స్టార్ సింగర్ గా గుర్తింపు ఉండగా నందు నటుడిగా, రియాలిటీ షోలకు యాంకర్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు. 2014 సంవత్సరంలో గీతామాధురి నందుల వివాహం జరగగా 2019లో గీతామాధురి పాపకు జన్మనిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బాబు పుట్టాడని గీతామాధురి దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాబుకు ధృవధీర్ తారక్ అనే పేరును ఫిక్స్ చేసినట్టు గీతామాధురి ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ ను అందరూ తారక్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. గీతామాధురి నందు కొడుకు పేరులో తారక్ అని ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. గీతామాధురి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. గీతామాధురి నందుల కొడుకు పేరు చాలా కొత్తగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. మరి కొందరు నెటిజన్లు గీతామాధురి , నందులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గీతామాధురి నందు ప్రేమించి పెళ్లి చేసుకోగా అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గీతామాధురి గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాడిన సాంగ్స్ లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. నందు కూడా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని సినిమాలలో నందు హీరోగా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరీ భారీ సక్సెస్ సాధించలేదు.
గీతామాధురి (Geetha Madhuri) నందు కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గీతామాధురి, నందు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో పాటు తమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ఈ జోడీ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.
‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!
నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!