బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరిద్దరు కలిసి ఉంటారు. ఎవరు విడిపోతారు అనేది చెప్పలేని పరిస్థితి. ఒక్క టాస్క్ చాలు బాండింగ్ బద్దలు కొట్టుకుని విడిపోవడానికి అన్నట్లుగా, గీతు గత రెండు వారాల నుంచీ బాలాదిత్యని దూరం పెడుతోంది. చాలాసార్లు ప్యాచప్ చేస్కుందామని బాలాదిత్య వచ్చినా కూడా గీతు మాత్రం ఎవైడ్ చేస్తునే ఉంది. ఇక సుదీప ఎలిమినేషన్ తర్వాత పెద్ద హైడ్రామానే జరిగింది. ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ ఏం మాట్లాడుకున్నారో టెలికాస్ట్ చేసే ఛాన్స్ లేదని గ్రహించిన గీతు బాలాదిత్య దగ్గర ఓపెన్ అయ్యింది.
బాలాదిత్యని తనతో మాట్లాడద్దని, కొన్ని రోజులు దూరంగా మాట్లాడకుండా ఉంటేనే మంచిదని చెప్పింది గీతు. ఎందుకంటే, తనతో యాంటీ అయినవాళ్లు అందరూ ఎలిమినేట్ అవుతున్నారని గీతు ఊహించింది. అంతకుముందు ఆరోహి, గతవారం చంటి , ఇప్పుడు ఈవారం సుదీప ఇలా వెళ్లిపోవడాన్ని గుర్తించింది. నామినేషన్స్ అప్పుడు తనతో ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్లు వెళ్లిపోతున్నారేంటి అని లెక్కలు వేసుకుంది గీతు. అందుకే, బాలాదిత్యని తనతో మాట్లాడకపోవడం మంచిదని స్ట్రయిట్ గా చెప్పేసింది.
దీనికి బాలాదిత్య ఎందుకు అని రెండు మూడు సార్లు నొక్కిమరీ గీతుని ఆడిగాడు. ఈవిషయం మొన్ని అఢిగినపుడు ఎందుకు చెప్పలేదు అని నిలదీశాడు. అప్పుడు కెమెరాలు ఉన్నాయని చెప్పలేదు అందరూ ఉన్నారని చెప్పలేదు అంటూ ఎదో రీజన్ చెప్పింది. నిజానికి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఏం మాట్లాడుకున్నా ఎక్కడా చూపించరని గీతు గుర్తించింది. అందుకే, బాలాదిత్యకి హితభోద చేసే ప్రయత్నం చేసింది. సుదీప లాస్ట్ టైమ్ నామినేషన్స్ అప్పుడు గీతుతో వాదన పెట్టుకుంది.
ఆదిరెడ్డిని సైతం లాజికల్ గా లాక్ చేయాలని చూసింది. ఎంత చెప్పినా కూడా ఆదిరెడ్డికి అర్ధం కాలేదంటూ అదే విషయాన్ని పదే పదే చెప్పింది సుదీప. అందుకే, ఆడియన్స్ ఓటింగ్ శాతం అనేది తగ్గిపోయింది. ఈవిషయంలో గీతు ఊహించగలిగింది. తనతో వాదన పెట్టుకోవద్దు, బాండింగ్ పెట్టుకోవద్దని బాలాదిత్యకి చెప్పింది. ఇక హౌస్ లో సుదీప వెళ్లిపోవడం గీతుకి మనసులో ఆనందం కలిగించిందనే చెప్పాలి. గత రెండు వారాలుగా గీతు సుదీపపై కంప్లైట్స్ చేస్తునే ఉంది.
ఆదిరెడ్డి, ఫైమాలతో సుదీప బాసిజం చూపిస్తోందని, నేను కెప్టెన్ తో మాట్లాడుతుంటే మద్యలో దూరుతోందని చెప్పింది. దీనికి ఫైమా కూడా తీట బాగా ఉందని అభిప్రాయపడింది. ఇప్పుడు సుదీప కూడా లేదు కాబట్టి , గీతు గేమ్ లో గేర్ మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే, లాజిక్ గా తను చేసే తప్పుని నిరూపించే ఛాన్స్ ఎవరికీ ఇవ్వదు గీతు. అంతేకాదు, టాస్క్ ల్లో కూడా తనదైన స్టైల్లో మార్క్ ని వేయాలని చూస్తుంది. మరి ఇప్పుడు ఈవారం నుంచీ గేమ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అదీ మేటర్.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!