Geetu, Nagarjuna: గీతుని బొమ్మాట ఆడిన నాగార్జున..! వీకండ్ మసాలా ఎపిసోడ్ రెడీ..!

  • October 29, 2022 / 04:42 PM IST

బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ కి ఎప్పుడెప్పుడు గట్టి డోస్ పడుతుందా అని గీతు యాంటీ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. వాళ్లు వెయిట్ చేసినట్లుగానే గీతుకి నాగార్జున చేతిలో ఫుల్ కోటింగ్ పడింది. చేపల టాస్క్ లో గీతు ఏం ఆడావ్ అంటూ రెచ్చిపోయాడు హోస్ట్ నాగార్జున. ఫిజికల్ గేమ్ ఇవ్వండి గుద్ది పారేస్తా అన్నావ్ కదా, గుద్ది పారేశావా అని అడిగాడు. మ్యాగ్జిమమ్ ఆడాను అంటే, ఆడితే చేపల టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లోనే ఎందుకు అవుట్ అయ్యావ్ అని ప్రశ్నించాడు.

అంతేకాదు, సంచాలక్ గా నువ్వు గేమ్ ఆడటం ఏంటి అని నిలదీశాడు. నువ్వు గెలవడం కోసం కాదు, అవతల వాళ్ల వీక్ నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్ అంటూ రెచ్చిపోయాడు నాగార్జున. ఇక్కడే గీతు ఎక్స్ ప్లనేషన్ ఇవ్వబోతుంటే, నోరు మూయించాడు. అందరూ గట్టిగా ఆడాలని కావాలనే రెచ్చగొట్టాను అని, పూల టాస్క్ అప్పుడు పూలు తీయడానికి ఎవరూ ట్రై చేయలేదని అనిపించిందని చెప్పింది గీతు. గేమ్ ఎలా ఉండాలి, ఇంట్రస్టింగ్ గా ఉండాలి అనేది బిగ్ బాస్ చూసుకుంటాడని, సీజన్ లో ఎవరి గేమ్ వాళ్లు ఆడితే అది ఎక్కడో ఉంటుందని చెప్పాడు.

అంతేకాదు, నాగార్జున దెబ్బకి హౌస్ మేట్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక్కడ వేరేవాళ్ల ఆటలో ఇన్వాల్ ఎందుకు అయ్యావ్, నువ్వు ఎవరు ఆటలో ఇన్వాల్ అవ్వడానికి అంటూ రెచ్చిపోయాడు నాగార్జున. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది అంటూ గీతుకి గట్టిపెట్టారు. నీకు కోపం వస్తే, కంప్లీట్ కామన్ సెన్స్, అన్నీ వెళ్లిపోతాయ్ నీకు అంటూ క్లాస్ పీకారు. ఇలా సంచాలక్ గా తప్పుగా గేమ్ ఆడినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ చెప్పాడు కింగ్ నాగార్జున. మరి గీతుకి ఎలాంటి పనిష్మెంట్ వచ్చిందో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. గీతుకి ఇలా గట్టి పెట్టాల్సిందే అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈవారం ఆర్జే సూర్య హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. 8వ వారం హౌస్లో 14మంది నామినేషన్స్ లో ఉన్నారు వారిలో రేవంత్ , శ్రీహాన్ టాప్ లో ఉండగా, ఆర్జే సూర్య ఓటింగ్ లో వెనకబడిపోయాడు. అందుకే, ఎలిమినేట్ అయ్యాడు. మరి ఈ శనివారం ఎపిసోడ్ లో ఇంకా ఎవరికి క్లాస్ పడిందో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus