Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?
- April 23, 2026 / 01:20 PM ISTByFilmy Focus Desk
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్ మాత్రమే కాకుండా, ప్రేక్షకుడు మనసులో నిలిచిపోయే స్థాయిలో ప్రభావం చూపుతాయి. అలాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘జెంటిల్ మెన్’. తమిళ్ దర్శకుడు శంకర్ తొలి సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. సమాజంలో ఉన్న అసమానతలపై ప్రశ్నిస్తూ పోరాడే ఒక వ్యక్తి కథను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోగా అర్జున్ సర్జా తన కెరీర్‌లో ఈ సినిమాతో స్టార్‌గా మరింత బలపడ్డారు.
Gentleman
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. మొదట ఈ కథను ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్ కు వినిపించి, ఆయనతో ఈ సినిమా చేయాలని దర్శకుడు శంకర్ ఎంతో ఆసక్తి చూపారట. కథ నచ్చి ఆయన చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాజశేఖర్ తన అనుభవలను పంచుకున్నారు. అయితే అదే సమయంలో తాను ‘అల్లరిప్రియుడు’ సినిమాకు డేట్స్ ఇచ్చి ఉండటంతో, ‘జెంటిల్ మెన్’ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక, ఆ సినిమాలో నటించే అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు.

తరువాత ఈ కథ అర్జున్ సర్జా దగ్గరకు వెళ్ళటం, ఆయన కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా నిలవటం అందరికి తెలిసిన విషయమే. 1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు, పలు అవార్డులను సొంతం చేసుకుంది. 175 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శితమై ప్రేక్షకుల మన్ననలు పొందింది.
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?
https://youtu.be/wnKKqOwIEvw?si=606Fke2k4Wc77ba2












