Getup Srinu: గెటప్ శీను డైరెక్ట్ కౌంటర్.. ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్..!

9 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తుంది ‘జబర్దస్త్’ కామెడీ షో. ఈ షో వల్ల ఎంతో మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఇప్పుడు వారు సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ లుగా.. కొనసాగుతున్నారు అంటే ‘జబర్దస్త్’ కారణం అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ‘జబర్దస్త్’ షోకి ఈ మధ్య కాలంలో చాలా మంది దూరమయ్యారు. ఈ లిస్టులో కిరాక్ ఆర్పీ కూడా ఉన్నాడు. అతను ఇటీవల ‘జబర్దస్త్’ షో పై అలాగే ‘మల్లెమాల..’ సంస్థ పై విరుచుకు పడుతుండడం మనం చూస్తూనే వచ్చాం.

అయితే ‘కిరాక్ ఆర్పీ’ చేసిన కామెంట్లను ఖండిస్తూ ఆటో రాంప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు చేసిన కామెంట్లు కూడా అందరికీ తెలిసిందే. అయితే సడన్ గా జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ వంటి వాళ్ళ పై షాకింగ్ కామెంట్లు చేశాడు. ‘జబర్దస్త్’ ద్వారా వీళ్లకు నేను లైఫ్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు.. అంటూ సుధీర్ పై కామెంట్లు చేశారు.

Getup srinu to file complaint at cybercrime police1

అంతేకాకుండా నేను ‘నాకు పారితోషికం పెంచండి నేను కార్ కొనుక్కుంటాను అని గెటప్ శ్రీను అడిగితే నా కార్ ఇచ్చేశాను’ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ‘వీళ్ళు హీరోలుగా చేస్తున్నారట, ఏ సినిమాలు ఆడుతున్నాయి’ అని కూడా విమర్శించాడు. తాజాగా ఏడుకొండలు కామెంట్లపై గెటప్ శీను కౌంటర్ ఇచ్చాడు. ‘నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చేశాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా.. కెమెరా ఉంటే సాలు సృహ లేకపోతే ఎలాయ్యా’..

అంటూ కొండలు ఉన్నట్టు ఉన్న ఎమోజీని తో ఓ స్టోరీ పెట్టాడు.అంటే ఏడుకొండలు తన కారుని గెటప్ శీను కి అమ్మేశాడు అని, కానీ ఏడుకొండలు మాత్రం ఇచ్చేశాను అని చెప్పుకుంటున్నాడు అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.ఆ తర్వాత ‘నేను చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్‌కి ఇతనే స్పూర్తి’ అంటూ ఏడుకొండలు ఫోటో షేర్ చేసి డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చాడు గెటప్ శీను.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus