Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 12, 2026 / 03:15 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధీర్ ఆనంద్ (Hero)
  • దివ్య భారతి (Heroine)
  • నితిన్ ప్రసన్న, సర్వదామన్ బెనర్జీ, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్, మొట్టై రాజేంద్రన్, చమ్మక్ చంద్ర తదితరులు (Cast)
  • వేద వ్యాస్ ఆకుల (Director)
  • మోగుళ్ళ చంద్రశేఖర్ (Producer)
  • లియోన్ జేమ్స్ (Music)
  • రసూల్ ఎల్లోర్, సన్నీ కొర్రపాటి (Cinematography)
  • విజయ్ ముక్తవరపు (Editor)
  • Release Date : 12th నవంబర్ 2026
  • మహతేజ క్రియేషన్స్ (Banner)

బుల్లితెర పవర్ స్టార్ గా సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ (Sudheer Anand) చాలా ఫేమస్. ఆ క్రేజ్ కారణంగానే హీరోగా ఇతనికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో సుధీర్ హీరోగా చేసిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ ‘కాలింగ్ సహస్ర’ వంటి సినిమాలు కంటెంట్ పరంగా ఆడియన్స్ ను మెప్పించలేదు. కానీ ‘గాలోడు’ సినిమా అయితే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. ఇక కొంత గ్యాప్ తర్వాత సుధీర్ హీరోగా వచ్చిన చిత్రం ‘గోట్'(GOAT). వాస్తవానికి 2 ఏళ్ళ క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:

GOAT Movie Review

GOAT Movie Review And Rating

కథ: రుద్రవరం అనే ఒక ఊరు. అక్కడి జనాలను బెట్టింగ్‌లకు బానిసలుగా చేసి, వాళ్ళ ఆస్తులు లాక్కునే అత్యంత క్రూరుడు మొద్దు బాబ్జి (నితిన్ ప్రసన్న). మరోవైపు సార్ (Sudheer Anand) ఓ గల్లీ రౌడీ. తిన్ తాగు పో అనే బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ (బ్రహ్మాజీ) వద్ద సార్ పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆనందపురం అనే ఊర్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న ఓ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించి తీసుకురమ్మని సార్‌కి ఒక డీల్ ఇస్తాడు ఆ రెస్టారెంట్ ఓనర్. అయితే పొరపాటున ఆ అమ్మాయికి బదులు మొద్దు బాబ్జి అనుచరుడు (ఆనంద రామరాజు) పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సుభాషిణిని (Divya Bharathi) ఎత్తుకొస్తాడు సార్.

దీంతో సార్.. బాబ్జికి అలాగే అతని మనుషులకి టార్గెట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ల బారి నుండి సార్ ఎలా తప్పించుకున్నాడు? హిట్లర్ గణ అలియాస్ గణపతి రాజుకి, సార్‌కి ఉన్న సంబంధం ఏంటి? రుద్రవరం ఊరి పెద్ద కృష్ణంరాజుతో(సర్వదామన్ బెనర్జీ) సార్‌కి ఉన్న లింక్ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

GOAT Movie Review And Rating

నటీనటుల పనితీరు: సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ ఈ సినిమాలో రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించాడు. బాగానే చేశాడు. కాకపోతే ఈ సబ్జెక్ట్ అతని ఇమేజ్ కి హెవీ అయిపొయింది. అందుకోసమే బలవంతంగా ‘జబర్దస్త్’ స్టైల్లో కామెడీ జోడించారు. అది ఇతని పాత్రని ఎలివేట్ చేయడానికి కానీ, కథని ముందుకు తీసుకెళ్లడానికి కానీ అస్సలు పనికిరాలేదు. దివ్య భారతి తొలి చిత్రంతోనే మంచి పాత్ర దక్కించుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఈమె లుక్స్ బాగున్నాయి, పాత్రలో డెప్త్ కూడా ఉంది. కానీ ఈమె ఎక్స్‌ప్రెషన్స్ సరిగా పలికించలేకపోయింది.

ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడింది. మొట్టై రాజేంద్రన్ ప్రశాంత్ పాత్రలో కనిపించాడు. అతని పాత్రతో చేయించిన కామెడీ కొంత రిలీఫ్ ఇస్తుంది. ఆయన కూడా బాగా చేశాడు. బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వీ పాత్రలు క్యామియోలని తలపించాయి. సర్వదామన్ బెనర్జీ చేసిన తాతయ్య పాత్ర చాలా రెగ్యులర్‌గా, బోరింగ్‌గా అనిపిస్తుంది. నితిన్ ప్రసన్న చేసిన విలన్ పాత్ర పండలేదు. కానీ విలన్‌గా అతని లుక్ మాత్రం బాగుంది.

GOAT Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: వేద వ్యాస్ ఆకుల తీసుకున్న పాయింట్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది. ‘సిగరెట్, మద్యం సేవిస్తే.. వారి ప్రాణాలకి మాత్రమే ముప్పు. కానీ జూదం వల్ల కుటుంబాలే నాశనమైపోతాయి’ అనే సెన్సిబుల్ అండ్ రిలేటబుల్ పాయింట్‌ను అతను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.అయితే ఇలాంటి పాయింట్‌ను మ్యాగ్జిమమ్ సీరియస్‌గా చెప్పాలి, లేదా లైటర్ వేన్‌లో చెప్పాలి. కానీ, ఈ సినిమా స్క్రీన్‌ప్లే అటు ఇటు కాకుండా ఉంది.

హీరో ఇమేజ్ కారణంగానో, లేక ఎవరైనా బలవంతంగా మార్పులు కోరారో ఏమో కానీ.. స్క్రీన్‌ప్లే మొత్తం అర్థరహితంగా ఉందనే ఫీలింగ్ ఇస్తుంది. ‘అయినా సుధీర్ సినిమాలో ఈ మాత్రం సబ్జెక్ట్ ఉంటే ఎక్కువేలే’ అని ఓపిగ్గా కూర్చునే వారిని సైతం ఈ సినిమా సంతృప్తి పరచదు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో.. అదీ ప్రీ-క్లైమాక్స్‌లో సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో మెయిన్ ప్లాట్ వస్తుంది. అనవసరమైన యాక్షన్ ఎపిసోడ్స్ జోడించి దానిని కిచిడీ కిచిడీ చేశారు. ఈ సినిమాకి నిర్మాత గట్టిగా ఖర్చు చేశాడు.

సుధీర్ మార్కెట్‌కి మూడింతలు పెట్టేశాడు. చాలా చోట్ల నిర్మాత పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. అయితే, సెకండాఫ్‌లో చాలా భాగం సుధీర్ నటించినట్టు అనిపించదు. ఏఐతో మమ అనిపించేసిన ఫీలింగ్ కలుగుతుంది. లియోన్ జేమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు బాగానే ఉన్నాయి. ‘ఓడియమ్మా’ సాంగ్ వినడానికి బాగుంది. మణిశర్మ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ‌కే. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ మాత్రం బాలేదు. సెకండాఫ్‌లో చాలా పోర్షన్ కట్ చేసే అవకాశం ఉన్నా, ఆ స్టెప్ తీసుకోలేదు.

GOAT Movie Review And Rating

విశ్లేషణ: 2 ఏళ్ల క్రితం విడుదల కావాల్సిన సినిమా, 10 ఏళ్ల క్రితం వచ్చినా అవుట్-డేటెడ్ అనిపించే కథనం.. కలగలిపిన ఈ ‘గోట్’.. థియేటర్లలో చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఓటీటీ ఆడియన్స్‌ను సంతృప్తిపరిచే ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఉన్నాయి. సెకండాఫ్ కూడా అలా ఉండి ఉంటే.. ఈ సినిమాకి కనీసం అక్కడి ప్రేక్షకులనైనా అలరించేది.

GOAT Movie Review And Rating

ఫోకస్ పాయింట్: మీనింగ్‌ఫుల్‌ కాన్సెప్ట్ వేస్ట్ అయిపోయింది.

రేటింగ్: 1.5/5 

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #divya bharathi
  • #Sudheer Anand
  • #Vedavyas

Reviews

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

GOAT Review in Telugu: గోట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

19 hours ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

19 hours ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

19 hours ago

latest news

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

20 hours ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

21 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

21 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

23 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version