గోపీచంద్ బ్యూటీ సంచలన కామెంట్లు వైరల్..!

  • June 5, 2021 / 08:39 PM IST

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తేమీ కాదు. 1970 ల నుండీ వస్తూనే ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా నెలకొల్పిన మీటూ ఉద్యమం దేశం మొత్తం పాపులర్ అయ్యింది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందుకు వచ్చి నిర్భయంగా వ్యక్తపరిచారు. చిన్మయి వంటి నటీమణులు ఇంకా దీని పై ఫైట్ చేస్తూనే ఉన్నారు. దీంతో చాలా వరకు నటీమణులకు వేధింపులు తగ్గాయని కొంతమంది చెబుతున్నప్పటికీ..

మరికొంత మంది కెరీర్ ప్రారంభంలో వారు ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి చెప్పుకొస్తున్నారు. తాజాగా నటి.. జరీన్ ఖాన్ కూడా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న భయానక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..”నేను ఓ కాల్ సెంటర్లో పని చేస్తూ బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని.అయితే కెరీర్ ప్రారంభంలో నాకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడు.ఎంతో మంచి వ్యక్తిలా నాతో మాట్లాడేవాడు.

అయితే ఓసారి ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని నన్ను రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాక ఆ సినిమాలో లిప్ లాక్ ఉంటుందని..మనం దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు.అతని ప్రవర్తన నాకు చాలా అసభ్యంగా అనిపించింది.అయితే నేను తొందర పడకూదని ఫిక్స్ అయ్యి వేరే కారణం చెప్పి అక్కడి నుండీ బయట పడ్డాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.అయితే అందరిలాగే ఈమె కూడా ఆ దర్శకుడి పేరు బయటపెట్టలేదు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈమె .. తెలుగులో గోపీచంద్ సరసన ‘చాణక్య’ అనే సినిమాలో నటించింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus