ఈరోజు ఎవ్వరూ ఊహించని విధంగా.. గోపీచంద్ – శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. దీనిని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మించబోతోంది. గతంలో గోపిచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బయ్యర్లకు భారీ లాభాలను అందించాయి. శ్రీవాస్ కూడా గోపీచంద్ తో తప్ప మిగిలిన హీరోలతో హిట్లు కొట్టలేకపోయాడు. ‘బాలయ్య – బోయపాటి’ కాంబోలా గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉంది.
గోపీచంద్ కు ఇది 30వ చిత్రం కావడం విశేషం. ఆగష్ట్ లో ఈ మూవీ.. సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా… ఈ ప్రాజెక్టు బాలయ్యతో చెయ్యాల్సినదే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీవాస్ ఓ కథని రెడీ చేసుకుని బాలయ్యని కలిసాడు.బాలయ్యకు ఈ కథ నచ్చడం.. `ఓకే` చెప్పడం కూడా జరిగాయి. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాల్సి ఉంది.
కానీ బాలయ్య ప్రస్తుతం 3 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.కాబట్టి ఇప్పట్లో అతనితో కష్టమని భావించి గోపీచంద్ తో పట్టాలెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కానీ బాలయ్య – శ్రీవాస్ కాంబోలో కూడా ఓ మూవీ రావడం ఫిక్స్ అని కూడా తెలుస్తుంది. గతంలో వీరి కాంబోలో ‘డిక్టేటర్’ మూవీ వచ్చింది. అది ఓ మోస్తారుగా ఆడింది.