ఆరడుగుల బుల్లెట్ గా గోపీచంద్

‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంపత్ నంది ‘రచ్చ’తో రెండో సినిమాకే మెగా కాంపౌండ్ లో కాలుపెట్టాడు. అంతటితో అతగాడి అదృష్టం ఆగలేదనుకునేలోపు మూడో సినిమా అవకాశం ఏకంగా పవర్ స్టార్ తో వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అప్పటినుండి ఇప్పటరివరకు పవన్ విషయంలో సంపత్ చెప్పే మాట ఒక్కటే. ఎప్పటికైనా పవన్ తో సినిమా చేసి తీరతానని. అది జరిగేమాట ఎలా ఉన్నా ఆ నెపంతో ఇతగాడు పవన్ క్రేజ్ ని వాడటంలో నిమగ్నమై ఉన్నాడు.గతేడాది రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చేసిన సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ తో ‘శంఖం’ సినిమా నిర్మించిన జె.భగవాన్, పుల్లారావు ఈ సినిమాని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ బ్యాంకాక్ లో పూర్తయింది. హన్సిక, కేథరిన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ ని ఖరారు చేసే దిశగా చిత్ర బృందం చర్చలు సాగిస్తున్నారట. పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో శ్రీమణి రాసిన ‘ఆరడుగుల బుల్లెట్’ పాట ఎంతటి ఆదరణ పొందిందో తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. ఇప్పుడా పాటలోని పదాన్ని తన సినిమా టైటిల్ గా మార్చేసుకున్నాడు సంపత్ నంది. అలాఅని ఇక్కడ సంపత్ ని ప్రత్యేకించి నిందించాల్సినది ఏం లేదు. సాయి ధరమ్, నితిన్ వంటి హీరోలు కూడా పవన్ ని వాడుతున్న తీరు తెలిసిందే. అయితే సంపత్ రాసుకున్న కథ ‘ఆరడుగుల బుల్లెట్’కి సరిపడిందా కాదా అన్నది తెలియాలి.

Gopichand Turns Brand Ambassador - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus