గోపీచంద్ , డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం రామబాణం. ఈ సినిమా మే 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ఐఫోన్ పిల్ల సాంగ్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇలా ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో ఈ పాట నాదేనని ఈ ట్యూన్ నాదే అంటూ కరీంనగర్ కి చెందిన గొల్లపల్లి రవీందర్ అనే గాయకుడు మీడియా ముందుకు వచ్చారు. సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గత 30 ఏళ్లుగా పాటలు పాడుతున్నాను. 1992లో చేతికి గాజులు పిల్లో.. అనే పాట రాశాను, అప్పట్లో ఆ పాట బాగా హిట్ అయింది. ఆ పాటలోని లైన్ ని, నా ట్యూన్ ని రామబాణం సినిమా పాటకి ఉపయోగించుకున్నారని తెలిపారు.
నా ట్యూన్ ఉపయోగించుకుంటున్నట్లు రామబాణం (Ramabanam) టీం ఎవరు కూడా నన్ను సంప్రదించి నా పర్మిషన్ తీసుకోలేదని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.ఈ విషయంపై దర్శక నిర్మాతలు స్పందించి తనకు మూడు రోజులలో వివరణ ఇవ్వాలని, లేకపోతే తాను లీగల్ గా ముందుకు వెళ్తానని ఈయన వెల్లడించారు అలాగే అప్పట్లో తన పాటను అందరికి మీడియా ముందు వినిపించారు. అప్పటి క్యాసెట్స్ తెచ్చి చూపించారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.
ఇలా ఈ సినిమా విడుదలకు ముందు ఈ విధమైనటువంటి వివాదాలను ఎదుర్కొంటుంది. మరి ఈ విషయంపై దర్శక నిర్మాతలు స్పందించి ఎలాంటి క్లారిటీ ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక గోపీచంద్ సైతం చాలా రోజులుగా హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాతో హిట్ కొట్టాలని గోపీచంద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?