Pawan Kalyan, Rana: పవన్ రానా మూవీ టైటిల్ ఫిక్సైందా?

  • August 8, 2021 / 04:22 AM IST

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కాగా పవన్, రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ టైటిల్ ను ఒకవేళ ఫిక్స్ చేస్తే మాత్రం రానాకు అన్యాయం జరిగినట్లే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మొదట ఈ సినిమాకు పరుశరామ కృష్ణమూర్తి అనే టైటిల్ వినిపించగా ఆ టైటిల్ బాగానే ఉందని పవన్, రానా ఫ్యాన్స్ భావించారు. అయితే పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని తెలిసిన తర్వాత టైటిల్ పరశురామ కృష్ణమూర్తి కాకపోవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో పవన్ రానా పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. మలయాళంలో టైటిల్ లో ఇద్దరు హీరోల పేర్లకు ప్రాధాన్యత ఉంటుంది.

తెలుగులో కూడా అదే విధంగా ఇద్దరు హీరోల పేర్లకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ టైటిల్ బాగుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నా అదే టైటిల్ ఫిక్స్ చేస్తే రానా ఒక విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus