Gowtham Menon: వాళ్లందరూ కుదరకపోతేనే ఆ సినిమాలోకి గౌతమ్‌ మీనన్‌ వచ్చారట

చిన్న సినిమాగా వచ్చి ప్రజల మన్ననలు పొందిన చిత్రం ‘పతంగ్‌’. వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ‘పతంగ్‌’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్‌ మీనన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. నిజానికి ఈ క్యారెక్టర్‌ను తెలుగు దర్శకుడు కానీ తెలుగు నిర్మాత కానీ చేయాల్సి ఉందట. కానీ వివిధ కారణాల వల్ల గౌతమ్‌ మీనన్‌ను తీసుకున్నాం అని దర్శకుడు ప్రణీత్‌ ప్రత్తిపాటి చెప్పుకొచ్చారు. దాంతోపాటు సినిమా గురించికొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు.

Gowtham Menon

‘పతంగ్‌’ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులకే రెండేళ్లు పట్టిందని చెప్పారు దర్శకుడు. సినిమా కోసం అంతగా శ్రమించామని, ఇప్పుడు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోందని చెప్పుకొచ్చారు దర్శకుడు. ఇక గౌతమ్‌ మీనన్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా సందీప్‌ రెడ్డి వంగా, ఎస్‌.జె. సూర్య, నాగ్‌ అశ్విన్‌ను తీసుకోవాలని నుకున్నామని కానీ వీలుపడలేదని చెప్పారు. అలాగే ఇదే పాత్ర కోసం ప్రముఖ నిర్మాత దిల్‌రాజును కూడా అనుకున్నామని చెప్పారాయన.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ (వంశీ పూజిత్‌), అదే ఏరియాలో ఉండే రిచ్‌ కిడ్‌ అరుణ్‌ (ప్రణవ్‌ కౌశిక్‌) చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్‌. ఒక్క రోజూ కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల మధ్యలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమె ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విజయ్‌ కృష్ణతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్‌ని కూడా ఇష్టపడుతుంది.

ఈ క్రమంలో విస్కీ, అరుణ్‌ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌లు ఎగరేసే పోటీ పెడతారు. ఆ పోటీనే ఎందుకు పెట్టారు? అందులో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే సినిమా కథ.

‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus