టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అతడు' 'ఖలేజా' తర్వాత రూపొందిన మూవీ 'గుంటూరు కారం'. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ఇక మొదటి నుండి కూడా ఈ సినిమా గురించి మరో నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉండటంతో 'గుంటూరు కారం' పై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే : నైజాం 42.00 cr సీడెడ్ 13.50 cr ఉత్తరాంధ్ర 13.80 cr ఈస్ట్ 8.60 cr వెస్ట్ 6.50 cr గుంటూరు 7.80 cr కృష్ణా 6.60 cr నెల్లూరు 3.60 cr ఏపీ + తెలంగాణ (టోటల్) 102.40 cr రెస్ట్ ఆఫ్ ఇండియా 8.00 cr ఓవర్సీస్ 20.00 cr వరల్డ్ వైడ్ (టోటల్) 130.40 cr (షేర్) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. https://youtu.be/ptkR5MN4uTQ గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్! హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్! ‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!