టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అతడు' 'ఖలేజా' తర్వాత రూపొందిన మూవీ 'గుంటూరు కారం'. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12 న అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే : నైజాం 16.32 cr సీడెడ్ 3.25 cr ఉత్తరాంధ్ర 4.00 cr ఈస్ట్ 4.01 cr వెస్ట్ 2.60 cr గుంటూరు 4.25 cr కృష్ణా 2.42 cr నెల్లూరు 1.50 cr ఏపీ + తెలంగాణ (టోటల్) 38.35 cr రెస్ట్ ఆఫ్ ఇండియా 2.46 cr ఓవర్సీస్ 10.60 cr వరల్డ్ వైడ్ (టోటల్) 51.41 cr (షేర్) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాకి రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ .51.41 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.79.59 కోట్ల షేర్ ను రాబట్టాలి. https://www.youtube.com/watch?v=a6cAUzYzYrE గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్! హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్! ‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!