Guntur Kaaram: మహేష్ గుంటూరు కారం సినిమాలో ప్రత్యేకతలు ఇవే.. ఏమైందంటే?

మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ మూవీకి శ్రీలీల లుంగీ డాన్స్ హైలెట్ కానుందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు కారం సినిమాకు శ్రీలీల డాన్స్ లు హైలెట్ గా నిలవనున్నాయని భోగట్టా. మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అంటే మ్యూజిక్ విషయంలో థమన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు థమన్ కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. మహేష్ శ్రీలీల లుంగీ డాన్స్ మామూలుగా ఉండదని మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేయడం ఖాయమని భోగట్టా. మహేష్ బాబు సినిమా సినిమాకు కెరీర్ పరంగా మరింత ఎదిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న మహేష్ బాబు సినిమా సినిమాకు హీరోగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

గుంటూరు కారం సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొనగా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సినిమాలను మించి గుంటూరు కారం సినిమా ఉండనుందని తెలుస్తోంది.

హారిక హాసిని బ్యానర్ కు ఈ సినిమా ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో చూడాలి. సంక్రాంతి కానుకగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా (Guntur Kaaram) రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సంక్రాంతికి పోటీ ఎక్కువగానే ఉన్నా సంక్రాంతి విజేత గుంటూరు కారం అని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus