H Vinoth: ‘జన నాయగన్’ డైరక్టర్ నెక్స్ట్ సినిమా.. ఎవరితో అంటే?
- July 10, 2026 / 04:00 PM ISTByFilmy Focus Desk
‘కరుప్పు’ సినిమాతో తమిళనాట భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. ఆ సినిమాకు తెలుగులో, తర్వాత ఓటీటీలో ఊహించని కామెంట్లు ఎదురైనా.. తమిళ బాక్సాఫీసు దగ్గర మాత్రం విజయం దక్కింది. ఈ విజయం ఇచ్చి ఉత్సాహంలో సూర్య.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సూర్య సెక్స్ట్ సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది.
H Vinoth
ఈ క్రమంలో చాలా పేర్లు వినిపిస్తున్నా.. అందులో ఓ పేరు కచ్చితంగా వినిపిస్తోంది. అదే హెచ్ వినోద్. ‘జన నాయగన్’ సినిమాతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శకుడు హెచ్.వినోద్ డైరక్షన్‌లో సూర్య కొత్త సినిమా ఉంటుంది అని అంటున్నారు. అయితే అది వెరీ నెక్స్ట్ కాదు. ఎందుకంటే సూర్య తన 48వ సినిమాను టీజీ జ్ఞానవేల్ డైరక్షన్‌లో చేస్తారు. సూర్యకు గతంలో ఆయన ‘జై భీమ్’ లాంటి హిట్ బొమ్మ ఇచ్చారు. ఆ సినిమా తర్వాతే హెచ్.వినోద్ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ప్రస్తుతం వినోద్.. ఆ సినిమా స్క్రిప్ట్ మీద పని చేస్తున్నారట. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. వినోద్ సినిమాల తరహాలోనే పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. నిజానికి వినోద్ నెక్స్ట్ సినిమా అజిత్‌తో అని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సూర్య పేరు చర్చలోకి వచ్చింది. ఇక సూర్య ఆ తర్వాత చేయబోయే 50వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఆ సినిమాను ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెరకెక్కిస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మిస్తారు అని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో ప్రకటన ఉండొచ్చు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇంకా ఏమీ రాలేదు.












