Hansika: నేను వాళ్లలా కాదు పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాను: హన్సిక

  • November 13, 2023 / 12:46 PM IST

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు… ఈ మాట వినగానే ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్లే గుర్తొచ్చేవారు. ఎన్నేళ్లు అయినా వరుసగా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి పెళ్లి తర్వాత వాళ్ల కెరీర్‌ పీక్‌ స్టేజీకి వెళ్తుంటుంది కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే టాలీవుడ్‌లోనూ కనిపిస్తోంది, సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తోంది. అలాంటి కథానాయికల్లో హన్సిక ఒకరు. ఇటీవల వివాహం చేసుకున్న హన్సిక… కెరీర్‌ను రీబిల్డ్‌ చేసుకునే పనిలో పడింది. వరుసగా సినిమాలు ఓకే చేస్తోంది.

అయితే ఇటీవల ఆమె చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న కథానాయికల ప్లానింగ్‌ గురించి మాట్లాడటమే దానికి కారణం. దీంతో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని హన్సిక ఇలా ఎందుకు మాట్లాడింది అని అనుకుంటున్నారు. ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది హన్సిక. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, అందం, అభినయం బాగుండటంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

కానీ ఆ స్టార్‌ డమ్‌ను ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది. కొన్ని సినిమాలు రాంగ్‌ సెలక్షన్‌ వల్ల పోతే, మరికొన్ని ఆమె ప్రమేయం లేకుండా పోయాయి. దీంతో స్టార్‌ హీరోల పక్కన నటించాల్సిన ఆమె కుర్ర హీరోలు, చిన్న హీరోలవైపు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ పరిశ్రమలోనూ సత్తాచాటిన హన్సిక ఇప్పుడు కోలీవుడ్‌కి మాత్రమే పరిమితం అయిపోయింది. పెళ్లి తర్వాత కూడా ఇదెలా సాధ్యం అని అడిగితే.. కొన్ని కామెంట్స్‌ చేసింది.

పెళ్లికి ముందుకు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అని చెప్పిన (Hansika) హన్సిక. సాయంత్రం ఆరు తర్వాత ఫ్యామిలీకే సమయం కేటాయిస్తాను అని అంటోంది. సినిమాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదు అని కూడా చెప్పింది. చాలా మంది పెళ్లైన హీరోయిన్లు కెరీర్‌ను సరిగా ఫ్లాన్ చేసుకోలేకపోతున్నారని, అందుకే వారి సంసార జీవితం సమస్యల్లో చిక్కుకుంటోంది అని చెప్పింది. తాను అలా కాదని, సినిమాలతో పాటు వైవాహిక జీవితానికి సమానంగా సమయం కేటాయిస్తుస్తున్నాను అని చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది హీరోయిన్స్‌గా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus