గతేడాది చివర్లో అంటే 2022 డిసెంబర్ 4న హీరోయిన్ హన్సిక పెళ్ళైన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సోహైల్ కతూరియాని ఆమె వివాహం చేసుకుంది. జైపూర్లోని ముండోతా కోటలో కొద్దిపాటి కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.సెలబ్రిటీల పెళ్లి వేడుకలను డిజిటల్ సంస్థలు భారీ రేటుకు కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హన్సిక పెళ్లి హక్కులను కూడా ఓ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.
లవ్ షాదీ డ్రామా పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హన్సిక పెళ్లి వేడుక స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఓ ప్రోమో లాంటి వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో హన్సిక చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా.. తన పెళ్లికి ముందు ఫేస్ చేసిన కొన్ని అనుభవాలను లవ్ షాదీ డ్రామాలో వెల్లడించింది హన్సిక. ” సోహైల్ ను పెళ్లి చేసుకునే వరకు ఆ విషయాన్ని లీక్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డాను.
అయినా మీడియాకు ఎలా లీకయ్యిందో తెలీదు.నా లైఫ్ లో నా తల్లి అన్ని విధాలా వెన్నెముకలా నిలిచింది. అయితే పెళ్లికి ముందు సోహైల్ కు ఇదివరకే పెళ్లైందని, అతను తన భార్యతో విడిపోవడానికి కారణం నేనే అని వార్తలు వచ్చాయి.అవి చూసి నేను చాలా ఏడ్చాను. నిజంగా ఆతని గతం నాకు తెలుసు. కానీ.. విడాకులతో నాకు సంబంధం లేదు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది హన్సిక.