ఇటీవల హిందీలో రిలీజ్ అయ్యి ఘనవిజయం అందుకున్న చిత్రం ‘హనుమాన్ అంశ్'(Hanuman Ansh). కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆదారం చేసుకుని తీసిన సినిమా ఇది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత తెలుగులో రిలీజ్ అవుతుంది.
ఓ దశలో ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెలుగులో రిలీజ్ చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఆయన తప్పుకోవడంతో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 9న విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ 700 స్క్రీన్స్ లో ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకో ఆశించిన స్థాయిలో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| డే1 | 1.0 cr |
| డే2 | 0.95 cr |
| టోటల్ గ్రాస్ | 1.95 cr |
| టోటల్ షేర్ | 1.02 cr కోట్లు |
‘హనుమాన్ అంశ్’ చిత్రం తెలుగు( తెలుగు రాష్ట్రాలు) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు. ఆల్మోస్ట్ అడ్వాన్సుల బేసిస్ పైనే విడుదల చేశారు. నష్టాలు వస్తే.. అయితే 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.02 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.