Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

సీనియర్ నటుడు నరేష్(Naresh) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఏ పాత్ర చేసినా దానికి వందశాతం న్యాయం చేస్తూ జీవం పోయడం ఆయన నైజం. విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోసం, నేటితరం యువ దర్శకులు సైతం ఎన్నో వైవిధ్యమైన పాత్రలను సృష్టిస్తున్నారు. పాత్ర నచ్చితే పారితోషికం గురించి సైతం ఆలోచించకుండా నటించడం నరేష్ గొప్పతనంగా చెప్పుకోవాలి. అయితే, తన వ్యక్తిగత జీవితం మరియు వ్యవహారశైలికి సంబంధించి నరేష్ తరచూ విమర్శలు ఎదుర్కొంటుంటారు.

Naresh

ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కళ్లజోడు, హెయిర్ స్టైల్ వంటి విషయాలపై నెట్టింట అనేక ట్రోల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా నటి పవిత్రా లోకేష్‌తో ఆయన రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోణంలో ఆయనపై వచ్చే ట్రోల్స్‌కు లెక్కే లేదు. వీటి సంగతి పక్కన పెడితే.. ఈ దసరా కానుకగా నరేష్ అత్యంత కీలక పాత్రలు పోషించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గరివిడి లక్ష్మీ’ కాగా, మరొకటి ‘క్రేజీ కళ్యాణం’.

ఈ రెండు సినిమాలను నరేష్ చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇవి తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయన్న ధీమాను సైతం ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రస్తుత జనరేషన్ పెళ్లి, పిల్లలు అనే విషయాన్ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలి?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.

నరేష్ దానికి బదులిస్తూ… “పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఇప్పుడు ఎవరూ తప్పుబట్టరు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనేది ఇప్పుడు లీగల్ అయిపోయింది. అయితే… పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా.. పిల్లల్ని మాత్రం కనండి” అంటూ నరేష్ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నరేష్ కామెంట్స్ పై నెట్టింట ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నరేష్ అయితే ట్రోల్స్ ను, నెగిటివ్ కామెంట్స్ ను పెద్దగా సీరియస్ గా తీసుకోరు.

ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus