Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు
- October 10, 2026 / 06:43 PM ISTByPhani Kumar
ఇటీవల హిందీలో రిలీజ్ అయ్యి ఘనవిజయం అందుకున్న చిత్రం ‘హనుమాన్ అంశ్'(Hanuman Ansh). కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆదారం చేసుకుని తీసిన సినిమా ఇది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత తెలుగులో రిలీజ్ అవుతుంది.
Hanuman Ansh

ఓ దశలో ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెలుగులో రిలీజ్ చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఆయన తప్పుకోవడంతో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 9న విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ 700 స్క్రీన్స్ లో ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకో ఆశించిన స్థాయిలో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అని చెప్పాలి.
ఎందుకంటే మొదటి రోజు ‘హనుమాన్ అంశ్’ చిత్రం కేవలం రూ.0.60 కోట్ల నెట్ కలెక్షన్స్ ను మాత్రమే సాధించింది. మైత్రి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తే.. వసూళ్లు కోటి లోపే ఉండటం… ట్రేడ్ పండితులను సైతం షాక్ కి గురిచేసింది. అందుకు కారణాలు లేకపోలేదు. నిన్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఇప్పటికే ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని చాలా మంది హిందీలో చూసేశారు. ఇదంతా ఒకవైపు అయితే.. నిన్న తెలుగు వెర్షన్ చూసిన ప్రేక్షకులు కొంత మిక్స్డ్ టాక్ కూడా చెప్పారు.
ఇలాంటి సినిమాలు గతంలో తెలుగులో చాలా వచ్చాయని. సోషల్ మీడియాలో ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని ఓవర్ హైప్ చేసారంటూ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే అప్పుడే రిజల్ట్ ను ఫైనల్ చేయకూడదు. ఎందుకంటే.. అక్టోబర్ 9న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 10 నుండీ దసరా సెలవలు ఉన్నాయి. సొ వీకెండ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో..!
పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్













