Hari Hara Veera Mallu: షూటింగ్‌కే దిక్కు లేదు.. రెండు పార్టులా.. ఎలాగబ్బా… సాధ్యమవుతుందా అంటున్న నెటిజన్లు!

సినిమా పెద్దదైతే.. రెండు ముక్కలవును. ఏంటిది సూక్తా అనుకుంటున్నారా? ఇంచుమించు అలాంటిదే. టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద దర్శకులు, నిర్మాతలు ఫాలో అవుతున్న సూక్తి ఇది. ఇక్కడ పెద్దది అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి నిడివి, రెండు బడ్జెట్‌. సినిమాకు బడ్జెట్‌ పెరిగిపోతే మొత్తం డబ్బులు వెనక్కి వచ్చేలా చేయడం ఈ ఆలోచన పరమార్థం అనొచ్చు. ఇప్పుడు రెండు ముక్కల కాన్సెప్ట్‌ గురించి ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే టాలీవుడ్‌లో మరో సినిమా రెండు ముక్కలు చేస్తున్నారు.

మామూలుగా అయితే రెండు పార్టుల్లో సినిమా అంటూ నీట్‌గా చెప్పొచ్చు. అయితే రెండు ముక్కలు అని ఎందుకు అంటున్నాం అంటే.. అనౌన్స్‌ చేసినప్పుడే రెండు భాగాలుగా సినిమా చేస్తాం అని చెబితే దాన్ని రెండు పార్టులు అనొచ్చు. అలా కాకుండా సగం సినిమా అయ్యాక రెండు పార్టులు అయితే మాత్రం రెండు ముక్కలు అనొచ్చు. అయితే ఇప్పుడు ఇలా అవుతుంది అంటున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. అవును మీరు చదివింది కరెక్టే. పవన్ కల్యాణ్ – క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

చాలా రోజులుగా షూటింగ్‌ మోడ్‌లో ఉండిపోయిన (Hari Hara Veera Mallu) ‘హరి హర వీరమల్లు’ సినిమా టీమ్‌ నుండి ఓ రూమర్‌ బయటకు వచ్చింది. అయితే పవన్‌ కల్యాణ్‌ యస్‌ అంటే.. అది న్యూస్‌ అయిపోతుంది అని చెప్పొచ్చు. సినిమా నిడివి పెరిగే అవకాశం ఉండటంతో సినిమాను రెండు భాగాలు రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఎడిట్‌ టేబుల్‌ మీదున్న ఫుటేజ్‌లో తొలి పార్ట్‌ రిలీజ్‌ చేసేయొచ్చు అని సమాచారం. మిగిలిన షూట్‌ కంప్లీట్ చేసి రెండో పార్ట్‌ రిలీజ్‌ చేస్తారట. అయితే ఇదంతా పవన్‌ ఓకే అంటేనే.

అయితే ఇక్కడ నెటిజన్లకు వచ్చిన డౌట్‌ ఏంటంటే.. అసలు ఈ సినిమా షూటింగ్‌కి డేట్స్‌ అంటేనే పవన్‌ వెనకడుగు వేస్తున్నారనే టాక్‌ మధ్యలో ఇలా రెండు పార్టుల రూమర్‌ ఏంటి అని. సినిమా అంత మేర షూటింగ్‌ అయ్యిందా అనే డౌట్‌ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మాత ఎ.ఎం.రత్నం ఏమంటారో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus