మొన్నటి వరకూ ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా అన్నారు. కానీ కొరటాల సీన్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్.. మహేష్ కు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగబోతుందట. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తరువాత రానా తో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 40శాతం ఫినిష్ అయ్యిందని వినికిడి.
దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రం కూడా చెయ్యబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇది కూడా పూర్తయ్యాక ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో హరీష్ శంకర్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించడానికి కూడా ఓకే చెప్పాడు. అయితే పవన్ పై రెండు సినిమాలు ఫినిష్ చెయ్యడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. దాంతో దర్శకుడు హరీష్ శంకర్.. రవితేజతో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ మధ్యనే రవితేజ- హరీష్ లు కలిసి.. సినిమా గురించి డిస్కస్ చేసుకున్నారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘షాక్’ ‘మిరపకాయ్’ అనే చిత్రాలు వచ్చాయి. ‘షాక్’ చిత్రాన్ని పూర్తిగా రాంగోపాల్ వర్మను శాటిస్ఫై చెయ్యడానికి తీసాడు హరీష్. అయితే తన మాస్ ట్యాలెంట్ ను ‘మిరపకాయ్’ తోనే బయటపెట్టాడు.దాంతో ఈ కాంబో పై మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే రవితేజ కూడా ‘ఖిలాడి’ పూర్తయ్యాక శరత్ మండవ అనే యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. తరువాత త్రినాధ్ రావు నక్కిన సినిమాకి కూడా ఓకే చెప్పాడు కానీ.. హరీష్ శంకర్ మూవీనే మొదట చేసే అవకాశాలు ఉన్నాయి.