మే 10న భారీఎత్తున విడుదలవుతున్న ‘‘సత్య’’

ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది. అలాంటి సొసైటిలో నా వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’. హమరేశ్, ప్రార్ధనా సందీప్‌లు జంటగా నటించిన ఈ చిత్రానికి వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడు. శివమ్‌ మీడియా బ్యానర్‌లో శివమల్లాల నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 10 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తెలియచేసింది. థింక్‌ మ్యూజిక్‌ద్వారా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటిపాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘సత్య’ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ వారు ‘యు’ సర్టిఫికెట్‌ను అందచేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ సినిమాకు సంబంధించిన అన్నిపనులు శరవేగంగా జరిగాయి. మే 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు పూర్తయ్యాయి’’ అన్నారు.

దర్శకుడు వాలీ మాట్లాడుతూ– ‘‘ ‘సత్య’ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందని నాకు ఎంతో మంచి పేరు తీసుకువస్తుందని నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు.

హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ, ఈ చిత్రానికి సంగీతం– సుందరమూర్తి కె.యస్, ఎడిటింగ్‌– ఆర్‌.సత్యనారాయణ, కెమెరా– ఐ. మరుదనాయగం, మాటలు– విజయ్‌కుమార్‌ పాటలు– రాంబాబు గోసాల, పీఆర్‌వో–వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల, లైన్‌ ప్రొడ్యూసర్‌– పవన్‌ తాత, నిర్మాత– శివమల్లాల, రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus