తెలుగు రాష్ట్రాల్లో “హలో గురు ప్రేమ కోసమే” సాధించిన వసూళ్లు

  • October 24, 2018 / 06:30 AM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ గత చిత్రాలు హైపర్, ఉన్నదీ ఒకటే జిందగీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” చేశారు. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ చిత్రం గత గురువారం (అక్టోబర్ 18న) రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 7.2 కోట్ల గ్రాస్ రాబట్టి.. రామ్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ఇచ్చింది. శుక్ర, శని, ఆదివారాల్లో జోరు ప్రదర్శించిన ఈ సినిమా.. పనిదినం కావడంతో సోమవారం తక్కువ కలక్షన్స్ సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 రోజులకుగాను 14.70కోట్ల షేర్ వసూళ్లను సాధించి.. నైజాం తో పాటు సీడెడ్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను చేరుకుంది. ఆంధ్రాలోనూ రెండు రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందించనుంది. ఓవర్సీస్ లోనే ఈ మూవీ జోరు కనబరచడం లేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. హాఫ్ మిలియన్ మార్క్ ను కూడా చేరుకోలేకపోయిందని వెల్లడించాయి. ఇప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా లేకపోవడం రామ్ కి కలిసి వస్తుందని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus