HER Chapter 1 Review in Telugu: హర్ చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 21, 2023 / 06:15 PM IST

Cast & Crew

  • వికాస్ వశిష్ట (Hero)
  • రుహాని శర్మ (Heroine)
  • ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్ తదితరులు (Cast)
  • శ్రీధర్ స్వరాఘవ్ (Director)
  • రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి (Producer)
  • పవన్ (Music)
  • విష్ణు బేసి (Cinematography)
  • Release Date : జూలై 21, 2023

ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమాలు మూడు, నాలుగు మాత్రమే ఉన్నాయి. అవి మూడు కూడా థ్రిల్లర్స్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.అవే ‘హిడింబ’ ‘హత్య’ ‘హర్’. ఇందులో ‘హిడింబ’ ‘హత్య’ సినిమాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ‘హర్’ గురించి చెప్పుకోవాలి. ‘చిలసౌ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘హిట్'(ది ఫస్ట్ కేస్) ‘డర్టీ హరి’ చిత్రాలతో సక్సెస్ లు చూసిన రుహాని శర్మ.. ఇప్పుడు ‘హర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : నగరం శివార్లలో ఓ జంట హత్యకి గురవుతారు. వాళ్ళే విశాల్ ప‌సుపులేటి(వినోద్ వ‌ర్మ‌), స్వాతి (అభిజ్ఞ‌). ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అర్చ‌న ప్ర‌సాద్ (రుహాణి శ‌ర్మ‌) రంగంలోకి దిగుతుంది. ఈ కేసు ఆమెకి ఛాలెంజింగ్ గా మారుతుంది. తర్వాత ఆమె ఇన్వెస్టిగేషన్లో ఈ కేసుకి కేశ‌వ్‌ అనే టెర్ర‌రిస్ట్‌తో సంబంధం ఉంద‌నే విషయం బయటపడుతుంది. అంతకు ముందు కేశ‌వ్‌ మరో కేసులో ఇన్వాల్వ్ అయ్యుంటాడు.

అతని వల్ల అర్చన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోతుంది. ఆ వ్యక్తి ఎవరు? వీటన్నిటికీ లింక్ ఏంటి? అర్చన… కేశవ్ ను పట్టుకుని ఈ కేసుని సాల్వ్ చేసిందా? లేక అతను కాకుండా ఇంకో వ్యక్తి ఈ కేసులో ఇవాల్వ్ అయ్యున్నాడా? అన్నది తెరపై చూడాల్సిన కథ.

నటీనటుల పనితీరు : రుహానీ శ‌ర్మ ఇప్పటి వరకు చేసినవన్నీ పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలే. అలాంటి రుహాని నుండి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. అందంతోనే కాదు సీరియ‌స్ లుక్స్ తో కూడా ఆకట్టుకోగలను అని ఈ మూవీతో ప్రూవ్ చేసుకుంది.ఇలాంటి పాత్రలకు విజయశాంతి ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆమె రేంజ్లో మెప్పించలేకపోయారు. భవిష్యత్తులో రుహాని ఇలాంటి పాత్రలతో మెప్పించే అవకాశం ఉందని ఈ మూవీతో సాంపుల్ గా చూపించినట్లు ఉంది.

తన వరకు చాలా బాగా నటించింది. వికాస్‌ బాగానే చేశాడు. కానీ అతని పాత్రకు ఉన్న నిడివి చాలా తక్కువ. ఇక ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ ఫేమ్ జీవ‌న్ కుమార్ త‌న నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పొచ్చు. అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్ వంటి వారు కూడా ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ ఫస్ట్ హాఫ్ ను నడిపించిన తీరు బాగానే ఉంది. పెద్దగా హడావిడి లేకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు. రుహాని కూడా వెంటనే ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ తో ఇన్వెస్టిగేషన్ మూడ్ ను డిస్టర్బ్ చేసింది లేదు. అయితే సెకండ్ హాఫ్ లో బోరింగ్ అంశాలు ఉన్నాయి. క్లైమాక్స్ హడావిడిగా వచ్చేసింది. అయినప్పటికీ ట్విస్ట్ బాగానే ఉంది. గ్రిప్పింగ్ నెరేషన్ అయితే ఇంకా బాగుండేది.

థ్రిల్లర్స్ ఓ రేంజ్లో ఎంగేజ్ చేస్తేనే తప్ప జనాలు థియేటర్ కు రాని రోజులివి. పైగా ఇది ఇన్ కంప్లీట్ అనే ఫీలింగ్ కూడా కలిగించింది. బహుశా చాప్టర్ 2 కోసం.. అది అలా అనిపించి ఉండవచ్చు. జస్ట్ పాస్ మార్కులతో ‘హర్’ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనుకోవచ్చు. నిడివి గంట నలభై నిమిషాలు మాత్రమే ఉండటం ఓ ప్లస్ పాయింట్.

నిర్మాణ విలువల్లో లోపాలు ఉన్నాయి. అయితే టెక్నికల్ టీం వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీలో రూపొందిన విజువల్స్ బాగున్నాయి.సంగీత దర్శకుడు పవన్ అందించిన నేపధ్య సంగీతం బాగానే ఉంది.

విశ్లేషణ : పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే .. ఈ ‘హర్’ ను ఒకసారి ట్రై చేయొచ్చు. ఎంజాయ్ చేయించేలా, థ్రిల్ చేయించేలా లేకపోయినా .. ఎంగేజ్ చేసే విధంగా అయితే ఈ మూవీ ఉందని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus