Ajith Daughter: వైరల్ అవుతున్న అజిత్ కూతురు అనౌష్క ఫోటోలు వైరల్…!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇతని సినిమాల కథలు విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అజిత్ మేకోవర్ చాలా సహజంగా ఉంటుంది. మేకప్ వేసుకోకుండానే చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు అజిత్. అందులోనూ ఇతను సికింద్రాబాద్ లో జన్మించిన వ్యక్తి కాబట్టి.. ప్రాంతీయ అభిమానం కూడా అజిత్ పై ఎక్కువే ఉంటుంది. 2022 లో ‘వలీమై’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్..2023 లో ‘తెగింపు'(తునివు) అనే చిత్రంతో సంక్రాంతికి రానున్నాడు.

ఇదిలా ఉండగా.. నిజజీవితంలో అజిత్ చాలా సింపుల్ గా ఉంటాడు. మీడియాకి కూడా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. ముఖ్యంగా తన ఫ్యామిలీని సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంచుతాడు. అజిత్ ది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ షాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటి అంటే.. ఇటీవల ఈమె సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంది.

అయితే ఈ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తుంది షాలిని కాదు. ఇకియా అనే తన అసిస్టెంట్. ఇటీవల షాలిని తన భర్త అజిత్ అలాగే.. కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్‏లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో హైలెట్ గా నిలిచింది అజిత్ కూతురు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది. ఈమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus