Nani: మంచి సినిమాకి కలెక్షన్ల రుద్దుడు అవసరమా నాని..!

నాని (Nani) నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) సినిమా రూపొందింది. రామ్ జగదీశ్ దీనికి దర్శకుడు. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్ (Harsh Roshan) , శ్రీదేవి ఆపళ్ళ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా సీనియర్ నటుడు శివాజీ  (Sivaji) కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ‘కోర్ట్’ సినిమా హైలెట్స్ గురించి చెప్పాలంటే.. ముందుగా అందరూ శివాజీ పోషించిన మంగపతి పాత్ర గురించి చెప్పి.. ఆ తర్వాత మిగిలిన హైలెట్స్ గురించి చెబుతున్నారు. ఈ సినిమాను కచ్చితంగా ‘మంగపతి క్యారెక్టర్ కోసమైనా చూడాలి’ అని ప్రేక్షకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

Nani

సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం ముందే రికవరీ అయిపోయింది. కాబట్టి థియేట్రికల్ నుండి ఎంత వచ్చినా.. అది ప్రాఫిట్. ‘ ‘కోర్ట్’ కనుక మీకు నచ్చకపోతే ‘హిట్ 3′ చూడటానికి రావద్దు’ అని నాని కూడా చెప్పాడు. కాబట్టి.. ఈ సినిమా చూడాలని కొంతమంది ఆశపడ్డారు. మొదటి రోజు మినిమమ్ ఆక్యుపెన్సీలు వచ్చాయి. ఓవర్సీస్లో కూడా 150 డాలర్ల వరకు కలెక్ట్ చేసింది. మంచి సినిమాకి ఇది గొప్ప ఫీట్. అది ఆ సినిమాకి దక్కిన గౌరవం అనుకోవాలి.

కానీ మేకర్స్ సడన్ గా కలెక్షన్స్ పోస్టర్ వదిలారు. ‘కోర్ట్’ సినిమా మొదటి రోజు రూ.8.10 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఆ పోస్టర్లో ఉంది. ఈ కలెక్షన్స్ లో నిజం ఉందా? లేదా? అంటే కచ్చితంగా అవును అని, కాదు అని చెప్పలేం. కానీ నిన్న కొంతమందికి హోలీ హాలిడే ఉంది. అయినప్పటికీ ఎక్కువ శాతం హోలీ సంబరాలు జరుపుకున్నారు. థియేటర్లకు వెళ్లిన జనాలు చాలా తక్కువ. మరోపక్క పరీక్షల సీజన్, అలాగే స్కూల్స్ కూడా రన్ అవుతున్నాయి.

ఇలాంటి టైంలో జనాలు థియేటర్ కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు లేవు. అయినా సరే మేకర్స్ ఏకంగా రూ.8 కోట్లు వచ్చినట్లు పోస్టర్ వదిలారు. నిజంగా వస్తే.. ‘ఓ మంచి సినిమాకి అలాంటి గౌరవం దక్కడం’ అందరికీ సంతోషాన్ని ఇచ్చేదే. కానీ ఒకవేళ ఫేక్ అయితే.. ‘ఓ మంచి సినిమాకి ఉన్న మర్యాద తీసేసినట్టే కదా’. కలెక్షన్స్ పై, కలెక్షన్స్ పోస్టర్స్ పై మోజు లేదు అంటూనే నాని ఇలా కలెక్షన్స్ పోస్టర్స్ ఎందుకు వదులుతున్నట్టు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus