యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో మంచి హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత ‘దిల్ రూబా’ (Dilruba) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వ కరుణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘శివమ్ సెల్యులాయిడ్స్’, ‘సారెగమ’ ‘ఏ యూడ్లీ’ సంస్థలపై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు వంటివి యూత్ ను ఆకట్టుకున్నాయి.
దీంతో సినిమాపై వాళ్ళ దృష్టి పడింది. కాబట్టి ఈ సినిమాకి (Dilruba) బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3 cr |
సీడెడ్ | 1 cr |
ఉత్తరాంధ్ర | 1.5 cr |
ఈస్ట్ | 0.35 cr |
వెస్ట్ | 0.25 cr |
గుంటూరు | 0.40 cr |
కృష్ణా | 0.40 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.1 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.5 cr |
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) | 8.6 cr (షేర్) |
‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు.పాజిటివ్ టాక్ వస్తే దాన్ని అచీవ్ చేసే అవకాశాలు లేకపోలేదు.