నేచురల్ స్టార్ నాని.. ‘అష్టా చమ్మా’ చిత్రంతో హీరోగా మారాడు. అంతకు ముందు ఆర్.జె గా, క్లాప్ బాయ్ గా పనిచేశాడు. వాస్తవానికి ‘అష్టా చమ్మా’ చిత్రానికి గాను నానికి ఎటువంటి పారితోషికం అందలేదు. కానీ సినిమా హిట్టై లాభాలు వచ్చిన తర్వాత రూ.15 లక్షల వరకు అందింది. ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల.. చిన్న సినిమాల నిర్మాతలు వచ్చి అతనికి లైన్ గా అడ్వాన్స్ లు ఇచ్చారు. ఆ క్రమంలో కొన్ని సినిమాలు హిట్ అవ్వడం జరిగింది.
తర్వాత రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు, గీతా ఆర్ట్స్ వంటి బడా నిర్మాణ సంస్థ వల్ల నాని ఇమేజ్ బాగా పెరిగింది. ఇప్పుడైతే అతను స్టార్ అయిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాకి గాను నాని అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.22 కోట్లు. ‘వైర ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు.
వారు నాని (Nani) మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అంత మొత్తం ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ఇక నాని నెక్స్ట్ ‘స్కంద’ నిర్మాతతో ఓ సినిమా చేస్తున్నాడు.శివ కార్తికేయన్ తో ‘కాలేజ్ డాన్’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి గాను నాని అందుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ.25 కోట్లు అని తెలుస్తుంది. అయితే దానిని మూడు వాయిదాలుగా చెల్లిస్తారని వినికిడి.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!