ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసినటువంటి ఈయన అనంతరం హీరోగా మారిపోయారు. అయితే హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాని ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కొనసాగుతున్నారు. చివరిగా నాని నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం నాని హాయ్ నాన్న అనే సినిమాలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు తాజాగా నాని ఒక రేడియో జాకీ తో కలిసి సరదాగా చిట్ చాట్ చేశారు ఈ క్రమంలోనే తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి నాని ఈ సందర్భంగా రివిల్ చేయడమే కాకుండా ప్రస్తుతం తన క్రష్ ఎవరు అనే విషయాలను కూడా బయటపెట్టారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తాను మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డానని తెలిపారు. తాను మూడో తరగతి చదువుతున్న సమయంలో స్కూల్లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండేది ఆ సమయంలో సోనీ అనే అమ్మాయి ఎంతో అందమైన డ్రెస్ వేసుకొని చాలా అందంగా కనిపించింది ఆమెను చూడగానే వెంటనే మాట్లాడాలి అనిపించింది కానీ తనతో మాట్లాడలేకపోయానని నాని తెలిపారు. ఆ సమయంలో నేను వళ్లంతా ఆకులు చుట్టుకొని ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొన్నాను.
తనతో మాట్లాడాలి అంటే సిగ్గు అనిపించింది అందుకే మాట్లాడలేకపోయానని ఇప్పుడు కనుక సోనీ కనిపిస్తే తప్పకుండా తాను పలకరిస్తాను అంటూ ఈ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం తన క్రష్ ఎవరు అనే విషయం గురించి కూడా నాని ఈ సందర్భంగా బయటపెట్టారు. హాయ్ నాన్న సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా తన ప్రస్తుత క్రష్ అని ఈ సందర్భంగా నాని (Nani) వెల్లడించారు.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!