న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి, దసరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. నానికి జోడీగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కొంతమంది కామెంట్లు చేశారు.
అయితే వెంకటేశ్ సైంధవ్ మూవీ కూడా డిసెంబర్ 21వ తేదీనే రిలీజ్ కానుండటం హాట్ టాపిక్ అవుతోంది. వెంకటేశ్, నాని బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మరోవైపు డిసెంబర్ 21వ తేదీ ఏపీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో నాని సినిమా గురించి మరింత చర్చ జరుగుతోంది. గతంలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా నాని కొన్ని కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే క్రిస్మస్ పండుగ ఉండటం వల్లే డిసెంబర్ 21వ తేదీని (Nani) నాని టార్గెట్ చేశారని తెలుస్తోంది. పండుగల సమయంలో రిలీజ్ చేస్తే కలెక్షన్లు బాగుంటాయని ప్రూవ్ అయిన నేపథ్యంలో నాని తన సినిమా రిలీజ్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దసరా మూవీ సక్సెస్ తో నాని రెమ్యునరేషన్ సైతం పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని కొత్త మూవీ శౌర్యవ్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలలో ఏ సినిమా ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
నాని 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నాని సినిమా సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా నిన్ను కోరి తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా విడుదలై సక్సెస్ సాధించగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.