అదేంటో కానీ… ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో థియేటర్లకు రప్పించలేకపోయాయి. ఉగాది టైంలో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) తీసేస్తే.. దాంతో పాటు వచ్చిన సినిమాలు, దాని తర్వాత వచ్చిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. గత వారం వచ్చిన ‘ఓదెల 2’ (Odela 2) ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాలు కూడా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో అందరి చూపు ‘హిట్ 3’ పైనే ఉంది.
శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని (Nani) హీరోగా నటించాడు. అతను ఓ నిర్మాత కూడా. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు. భయంకరమైన వయొలెన్స్ ఉంటుంది అని నాని ముందుగానే చెప్పేశాడు. టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు. నాని సినిమా అంటే ఆడియన్స్ కి ఓ నమ్మకం ఉంటుంది. అతను ఏ జోనర్లో సినిమాలు తీసినా టార్గెటెడ్ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లి ఆ సినిమాని చూస్తారు.
అతని ప్రధాన బలాలు రెండే రెండు. ఒకటి ఓటీటీ.. రెండోది ఓవర్సీస్. ఈ రెండిటి వల్ల నాని సినిమాలు రిలీజ్ కి ముందే సేఫ్ అవుతూ ఉంటాయి. ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) వంటి ప్లాప్ సినిమాని కూడా ఓవర్సీస్ ఆడియన్స్ ఎగబడి చూశారు. వరుస సినిమాలతో ఓవర్సీస్ లో 1 మిలియన్లు కొడుతున్న ఏకైక మిడ్ రేంజ్ హీరో నాని. ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ బాగా డల్ అయ్యింది. అందుకే నాని ‘హిట్ 3’ ప్రమోషన్స్ ని అక్కడి నుండే మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు.
ఫస్ట్ రివ్యూ వచ్చేది ఓవర్సీస్ నుండే..! కాబట్టి.. అక్కడి జనాలకి తన సినిమా గురించి తెలియజేయాలి అనుకుంటున్నాడు. అందుకోసం అమెరికా వెళ్లి అక్కడి ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఎలాగు నాని కజిన్ సిస్టర్స్ అక్కడే ఉన్నారు. దర్శకుడు శైలేష్ కొలను బంధువులు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లినట్టు ఉంటుంది. సినిమాను ప్రమోట్ చేసినట్లు ఉంటుంది. ‘హాయ్ నాన్న'(Hi Nanna) విషయంలో కూడా నాని ఇదే చేశాడు. అందువల్ల సో సో గా ఉన్నప్పటికీ ఆ సినిమా బాగానే ఆడింది.