Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి రేసింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ అనే ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న అజిత్.. వేగంగా కారుతో దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయారు. దీంతో కారు ట్రాక్ బయటకు వెళ్లి ప్రమాదానికి దారి తీసింది. అదృష్టవశాత్తు అజిత్‌కు ఏమీ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ టీమ్ స్వయంగా షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. అజిత్‌కు ఇదేమి మొదటి ప్రమాదం కాదు.

Ajith Kumar

ఇప్పటికే జనవరిలో దుబాయ్‌లో జరిగిన రేసింగ్ ఈవెంట్‌లో, అలాగే స్పెయిన్‌లో ప్రాక్టీస్ సమయంలో కూడా ఆయన రెండు ప్రమాదాల్లో గట్టిగా బయటపడ్డారు. వరుసగా మూడు ప్రమాదాల్లోనూ తీవ్ర గాయాలేమీ కాలేదు. అయితే తరచూ ప్రమాదాల వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అజిత్ మాత్రం చాలా కూల్‌గా స్పందించారు. రేసింగ్ ప్రమాదాలన్నీ సర్వసాధారణం అంటూ అభిమానులను ఇదివరకే ఓ మెసేజ్ ఇచ్చారు.

సినిమాలతో పాటు రేసింగ్‌ను కూడా తన జీవన విధానంగా మార్చుకున్న అజిత్.. ప్రొఫెషనల్ రేసర్‌గా ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటూ తాను గెలవాలని అనేదాని కన్నా ఆనందించాలనే దృక్పథంతో రేస్ చేస్తున్నట్టు చెబుతుంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) అజిత్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన మాస్ అవతారానికి క్రేజ్ పెరిగింది. ఈ సినిమా రూ.200 కోట్లు దాటేసి అజిత్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌స్ లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అజిత్ కొంత సమయం విశ్రాంతి కోసం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక తన కొత్త సినిమాపై వచ్చే నెలలోనే ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus