Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాపై నెగిటివ్ రివ్యూలు చెప్పే వారిపై లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) ఫైర్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చాలా వరకు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొంతమంది నెగిటివ్ టాక్ కూడా చెబుతున్నారు. విదేశాల్లో ఉండి.. ప్రతి సినిమాకి కావాలని నెగిటివ్ టాక్ చెప్పే ఓ యూట్యూబర్ ఈ సినిమాకి దారుణమైన రివ్యూ ఇస్తూ వీడియో చేశాడు.

Vijayashanti

అతనిపై ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీం కేసు వేసినట్టు కూడా టాక్. ఇక అతనిలా నెగిటివ్ టాక్ చెప్పే వారిపై విజయశాంతి స్పందిస్తూ… “కొంతమంది సినిమాని డిస్టర్బ్ చేయడానికి ఉంటారు. అది వాళ్ళ సంస్కారం. మనం దాన్ని ఏమీ చేయలేము. అది వాళ్ళ శాడిజం అంటారో, ఇంకేమంటారో నాకు తెలీదు. సినిమాని ఖూనీ చేద్దామనుకుని కొంతమంది దుష్టశక్తుల్లా ప్రయత్నిస్తుంటారే.. వాళ్లకు నేను (Vijayashanti) వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి ఆపండి ఇక.

ఏ రూపంలో అయినా మీరు వస్తున్నారు.. డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్లకు ప్రజలు వెళ్తున్నారు, అది అద్భుతం అంటున్నారు. ఇలా పాజిటివ్ గా ఉన్నప్పుడు మీ పైశాచికంగా ప్రవర్తించకండి. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల ఎక్కిస్తూ, కెలుకుతూ, బ్రెయిన్ వాష్ చేస్తుంటే.. వాళ్ళ దగ్గరకు వెళ్లి చెంచా కొట్టుకోండి. కానీ సినిమాని చంపకండి. ఏ సినిమాని అయినా కోట్లు ఖర్చుపెట్టి తీస్తుంటారు. హీరోలు,డైరెక్టర్లు, టెక్నిషియన్.. లు కష్టపడి పని చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళ వల్ల.. వారికి అసౌకర్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరినీ ఇలా బాధ పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు.

కావాలని పనిగట్టుకుని ఇలాంటివి చేస్తున్నారు. ఏ హీరో సినిమాకి అయినా ఇలాంటివి మంచిది కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలి అని మేము అందరం కోరుకుంటాం. బాగున్నది బాలేదు… అనేది ఎందుకు. మేము అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం. అన్నీ దాటేసి వచ్చేశాం. నిర్మాతలు కోట్లు పెట్టి తీస్తున్న సినిమాని చంపేద్దాం అనుకుంటున్నారే… జీవితంలో మీలాంటి వాళ్ళని మాత్రం క్షమించకూడదు. దయచేసి.. ఈ చీప్ పనులు మానుకోండి. అందరూ హీరోలు బాగుండాలి. అందరి సినిమాలు ఆడాలి. సినిమా పరిశ్రమని బతకనివ్వండి” అంటూ నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారికి వార్నింగ్ ఇచ్చారు.

మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus