బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ గుర్తింపు సంపాదించిన హీరోయిన్ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం పక్కన నా పేరుతో ఆలయం ఉంది. అక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి” అని చెప్పింది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్శిటీలో తన ఫోటోకు పూలదండలు వేసి కొలుస్తారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఊర్వశిపై ట్రోల్స్‌తో ముంచెత్తారు.
బద్రీనాథ్ సమీపంలోని బామ్నిలో ఉన్న ప్రాచీన ఊర్వశి ఆలయాన్ని తనదిగా పేర్కొనడం తప్పు అంటూ విమర్శలు వచ్చాయి. బామ్నికి చెందిన స్థానికులు, పురోహితులు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ ఆలయానికి ఊర్వశి రౌతేలా అనే నటికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఆలయ గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు” అని స్పందించారు. వివాదం ముదరడంతో ఊర్వశి స్పందిస్తూ ఓ వివరణ వీడియోను విడుదల చేసింది.
“తన పేరు మీద ఆలయం ఉంది అన్నానేగానీ, అది తన ఆలయం అని అనలేదని” చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ వీడియోలో ఆమె క్లియర్‌గా “నా ఆలయం సందర్శించండి” అన్నట్లు ఉన్నదని కామెంట్లు చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిన సమయంలో, మళ్లీ తప్పును ఖండించడమేంటంటూ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊర్వశి తాజా వివరణ కూడా వివాదాన్ని తగ్గించలేదు. సోషల్ మీడియాలో “తెలివితక్కువ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తిరిగి తప్పు మనుగొనకుండా కవర్ చేయాలని చూస్తోంది” అంటూ కామెంట్లు పెరుగుతున్నాయి.
ఢిల్లీ యూనివర్శిటీ కామెంట్‌పై కూడా విద్యార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. “ఊర్వశి ప్రచారం కోసం ఏదైనా చెబుతోందా?” అంటూ చాలామంది అనుమానిస్తున్నారు. మొత్తానికి ఊర్వశి ఆలయం వ్యాఖ్యలు చుట్టూ జరిగిన ఈ రచ్చ ఇప్పటికీ నెట్టింట చర్చనీయాంశంగానే ఉంది. నేరుగా క్షమాపణ చెప్పి సున్నితమైన అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో, మళ్లీ తప్పుని తేలికగా తీసుకోవడం ఆమె ఇమేజ్‌కు మైనస్ అవుతున్నట్లే కనిపిస్తోంది.