ఫ్లాష్ బ్యాక్ : ఆ స్టార్ హీరో తప్పుకోవడం వల్ల రాజశేఖర్ కు కలిసొచ్చిందట..!

  • December 9, 2020 / 10:55 AM IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్.. అప్పట్లో ఈయన్ని యాంగ్రీ యంగ్ మెన్ అనే వారు. టాలీవుడ్లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. రాజశేఖర్ ను మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ‘వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఈయన పనైపోయింది’ అని అంతా అనుకున్న టైములో ఒక్క హిట్ ఇచ్చి మళ్ళీ ఫామ్లోకి రావడం రాజశేఖర్ కు మాత్రమే చెల్లింది. అంతేకాదు ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలతో బోర్ కొట్టించేవాడు కాదు. అందుకే రాజశేఖర్ ను స్పెషల్ గా చెప్పుకోవాలి. సరే ఇక అసలు మేటర్ కు వద్దాం.! రాజశేఖర్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ..

‘అల్లరి ప్రియుడు’ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకూ ఈయన చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ చిత్రం. అంతేకాదు అప్పటి యూత్ కు రాజశేఖర్ ను దగ్గర చేసిన చిత్రమిదే కావడం విశేషం. కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. కీరవాణి సంగీతం మెయిన్ హైలెట్ అని కూడా చెప్పాలి. ‘ఎప్పుడూ సీరియస్ పాత్రలు చేసే రాజశేఖర్.. ఇలాంటి లవ్ స్టోరీలకు సెట్ అవుతాడా’ అనే నెగిటివ్ కామెంట్స్ కూడా అప్పట్లో చాలా వినిపించాయట.

కానీ వాటన్నిటినీ రాజశేఖర్ తన నటనతో పటాపంచలు చేసాడని తెలుస్తుంది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి రాజశేఖర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అవును.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రంలో హీరోగా మొదట సుమన్ ను అనుకున్నారట. కానీ అప్పటికి సుమన్ గారు కొన్ని సమస్యల్లో చిక్కుకోవడం వల్ల ఈ ప్రాజెక్టుకి దూరమయ్యారట. దాంతో రాజశేఖర్ కు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus