Hero Ram: ‘స్కంద’ తో రామ్ కి కెరీర్ బెస్ట్.. మాస్ లో బోయపాటి క్రేజ్ అలాంటిది మరి..!

  • October 5, 2023 / 12:37 PM IST

బోయపాటి శ్రీను.. టాలీవుడ్లో ఉన్న మాస్ డైరెక్టర్స్ లో ఒకరు. రాజమౌళి తర్వాత మాస్ ఆడియన్స్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న దర్శకుడు ఈయనే అనడంలో అతిశయోక్తి లేదు. ‘భద్ర’ ‘తులసి’ ‘సింహా’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న బోయపాటి.. ఆ తర్వాత నుండి వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా రామ్ తో బోయపాటి చేసిన ‘స్కంద’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోయపాటి మరోసారి తన సత్తా చాటాడు అనే చెప్పాలి.

మొదటి రోజు రామ్ (Hero Ram) కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం .. ఇప్పుడు 6 రోజుల్లో దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. రామ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ‘స్కంద’ అంత భారీ మొత్తం కలెక్ట్ చేసి షాకిచ్చింది. హీరో ఎలివేషన్ సీన్స్ కు మాస్ ఆడియన్స్ థియేటర్స్ లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.

ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి బోయపాటి.. ‘స్కంద 2 ‘ పై కూడా అంచనాలు ఏర్పడేలా చేశాడు. శ్రీలీల గ్లామర్, తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా సినిమాలో హైలెట్స్ అని చెప్పాలి. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus