Hero Ram: హీరో రామ్ వేసుకున్న స్టైలిష్ షర్ట్, స్పైక్స్‌ కాస్ట్ ఎంతంటే..!

ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని లేటెస్ట్ క్లిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. స్టైలిష్ అండ్ కిరాక్ లుక్‌లో కనిపించి.. ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు రామ్.. ట్రెండీ కాస్ట్యూమ్స్, గాగుల్స్, గడ్డంతో రగ్డ్ లుక్‌తో అదిరిపోయాడు.. ఓ క్లాతింగ్ షోరూమ్ ఓపెన్ చేయడానికి తన సొంత ఊరు విజయవాడ వచ్చాడు రామ్..

తనను చూడ్డానికి ఫ్యాన్స్, బెజవాడ జనాలు పెద్ద ఎత్తున వచ్చారు.. ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలూ పడ్డారు.. సెలబ్రిటీ ఎవరైనా బయట స్టైలిష్‌గా కనిపిస్తే.. వాళ్ల డ్రెస్, షూస్, వాచెస్ లాంటి వాటి గురించిన వివరాలు.. వాటి ధరలు తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు.. ఇప్పుడలానే రామ్ వేసుకున్న షర్ట్, షూస్ (కొద్ది రోజుల క్రితం ఫోటోషూట్ కోసం) గురించిన న్యూస్ వైరల్ అవుతోంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1. పిఎస్ పాల్ స్మిత్ ఆబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ షర్ట్ : (Paul Smith Abstract Print Shirt) – రూ. 18,500..

2. క్రిస్టియన్ లౌబౌటిన్ లూయిస్ స్పైక్స్ : ( Christian Louboutin Louis Spikes) – రూ. 77,036..

ఫస్ట్ ఫిలిం ‘దేవదాసు’ తోనే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ పోతినేని ‘జగడం’, ‘రెడీ’, ‘మస్కా’, ‘కందిరీగ’, ‘పండగ చేస్కో’, ‘నేను.. శైలజ’ లాంటి సినిమాలతో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో సరికొత్త రామ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.. ఈ మూవీ ఇద్దరికీ కమ్ బ్యాక్ ఇచ్చింది.. ‘రెడ్’ లో డ్యుయెల్ రోల్‌తో ఆకట్టుకున్నాడు.. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో చేసిన ‘వారియర్’ అనుకున్నంతగా ఆడలేదు..

ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చెయ్యబోతున్నాడు.. దాని కోసమే ఇలా సరికొత్త అవతారంలోకి మారిపోయాడు రామ్.. తొలిసారి హీరో, దర్శకుడు, నిర్మాత కలయికలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus