సచిన్ టెండూల్కర్ ను కలిసిన హీరో సూర్య… వైరల్ అవుతున్న ఫోటో!

  • February 16, 2023 / 08:05 PM IST

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. క్రికెట్ అభిమానులు దేవుడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం సాధారణ వ్యక్తులే మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం సచిన్ కి అభిమానులుగా ఉన్నారు. 25 ఏళ్ల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ తో రికార్డులు సృష్టించిన టెండూల్కర్ ప్రస్తుతం తన క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య గురించి పరిచయం అవసరం లేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అయినప్పటికీ తెలుగులో సూర్యకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.సూర్య నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ, అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో సూర్యకు ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇలా నటుడిగా సూర్య ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను కలిసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటో సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా సూర్య సచిన్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ ఎక్కడ కలిశారు ఎందుకు కలిశారు. అనే విషయం తెలియదు కానీ సూర్య మాత్రం ఈ ఫోటోని షేర్ చేస్తూ రెస్పెక్ట్ అండ్ లవ్ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus