కోలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం వెనుక ఇంత జరిగిందా?

  • May 30, 2024 / 09:02 PM IST

తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఆంటోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ఆంటోని సినిమాలలో బిచ్చగాడు (Bichagadu), బిచ్చగాడు సీక్వెల్ తెలుగులో కూడా హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించాయి. అయితే తాజాగా విజయ్ ఆంటోని చెప్పులు వేసుకోనంటూ షాకింగ్ నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో విజయ్ ఆంటోని నటించిన తుఫాను సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఆంటోని (Vijay Antony)  షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నేను గత 90 రోజుల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని అందరూ నేను ఏదో దీక్ష చేయడం వల్ల చెప్పులు లేకుండా నడుస్తున్నానని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. అలాంటిదేం లేదని ఒకరోజు చెప్పులు లేకుండా నడిస్తే ప్రశాంతంగా అనిపించిందని చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా మంచిదని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. చెప్పులు లేకుండా నడవడం మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుందని చెప్పులు లేకుండా తిరగడం వల్ల నేను ఒత్తిడికి గురి కాలేదని ఆయన తెలిపారు.

అందుకే లైఫ్ లాంగ్ చెప్పులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని విజయ్ ఆంటోని వెల్లడించారు. విజయ్ ఆంటోని నిర్ణయం మంచి నిర్ణయమే అయినా ఆచరణలో చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వేసవి కాలంలో చెప్పులు లేకుండా కొన్ని సెకన్లు నడవాలన్నా ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఘటనల వల్లే విజయ్ ఆంటోని ఒత్తిడికి గురై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ ఆంటోని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. విజయ్ ఆంటోని రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిచ్చగాడు3 మూవీ 2026లో రిలీజ్ అవుతుందని విజయ్ ఆంటోని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus