Vikram: కథల ఎంపికలో ఆ స్టార్ హీరో మారక తప్పదా?

  • October 25, 2022 / 07:02 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన విక్రమ్ గత కొన్నేళ్లలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలలో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో ఫ్లాప్ రిజల్ట్స్ ను అందుకున్నారు. విక్రమ్ పాత్రల విషయంలో పెడుతున్న శ్రద్ధ కథ విషయంలో పెట్టడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం విక్రమ్ మరో ప్రయోగాత్మక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. పా.రంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ తంగలాన్ అనే సినిమాలో నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో విక్రమ్ గాడిదల కాపరి పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. విక్రమ్ సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు చేస్తున్నారు. పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కు అపరిచితుడు సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ దక్కకపోవడంతో ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

మరోవైపు విక్రమ్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సక్సెస్ ట్రాక్ లో లేని దర్శకులకు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. పొన్నియిన్ సెల్వన్ సినిమా సక్సెస్ సాధించినా అన్ని భాషల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదనే సంగతి తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

విక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విక్రమ్ సినిమాలు ఫ్లాపవుతున్నా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తగ్గడం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ కు విలన్ గా విక్రమ్ నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus