Vishal: నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో త్వరలో చెబుతా: విశాల్

Advertisement

ఇప్పుడు విశాల్ వయసు 44 ఏళ్ళు. ఇంకా ఇతను పెళ్లి చేసుకోలేదు. ఎంత హీరోలైనా ఇంత వయసు వచ్చేవరకు ఆగరు. విశాల్ వయసున్న హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేసి హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ అంటే విశాల్ కంటే చిన్నవాడే కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకుని ఈ విషయాలు చెప్పడం లేదు. నిజానికి విశాల్ 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవాల్సిన వాడు. కొన్నాళ్ళు వరలక్ష్మీ శరత్ కుమార్‌ తో ప్రేమాయణం నడిపిన విశాల్…

తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళు ఈమెతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే ఊహించని విధంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత అనీషా రెడ్డి పెళ్లి ఓ బిజినెస్ మెన్ తో కుదిరింది అనే వార్తలు వచ్చాయి. తర్వాత విశాల్ తో ఎంగేజ్మెంట్ టైం లో తీసుకున్న ఫోటోలు కూడా ఈమె డిలీట్ చేసింది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్…

నడిగర్‌ సంఘం బిల్డింగ్ కట్టించిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. మరోపక్క విశాల్ ప్రేమలో పడినట్లు కూడా హింట్ ఇచ్చి షాకిచ్చాడు. ‘పెద్దలు కుదిర్చిన పెళ్లి మనకి కలిసి రాదు అని తెలిసింది. అందుకే ఇక లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు’ విశాల్ తెలిపాడు. ‘ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను..

త్వరలోనే ఆమె ఎవరన్న విషయాన్ని రివీల్ చేస్తాను.ఆమెనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో విశాల్ చెప్పుకొచ్చాడు. నిజంగానే విశాల్.. ప్రేమలో ఉన్నాడా? లేక కావాలనే అలా చెబుతున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus