కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఆ భారం మధ్య తరగతి జనాలపై మాత్రమే కాకుండా సినీ నిర్మాతలపై కూడా పడింది. బడ్జెట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమాలు చేసే మిడ్ రేంజ్ హీరోలు సైతం ఇప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోల (Heroes) సినిమాలు ఎలాగైనా వంద కోట్ల షేర్ ను రాబట్టేస్తాయి. కానీ మిడ్ రేంజ్ హీరోల (Heroes) విషయంలో అంత బడ్జెట్ అంటే నిర్మాతకి చాలా రిస్క్ ఉంటుంది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. కొంతమంది హీరోలకి వంద కోట్ల షేర్ సినిమాలు లేకపోయినా.. నిర్మాతలు వంద కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. ఆ హీరోలు (Heroes) ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై కంప్లీట్ ఫోకస్ పెట్టడం లేదు. ‘అజ్ఞాతవాసి’ తో (Agnyaathavaasi) సినిమాలకు స్వస్తి చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ పార్టీని 5 ఏళ్ళ పాటు నిలబెట్టడానికి సినిమాలు చేయాల్సి వచ్చింది. అలా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (Bro) వంటి సినిమాలు చేశారు కానీ అవి వంద కోట్ల షేర్ ను రాబట్టలేదు. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలు ‘ఓజి’ (OG) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటి వాటికి వంద కోట్ల బడ్జెట్ అవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకి యునానిమస్ హిట్ టాక్ వస్తే వంద కోట్ల షేర్ అనేది కేక్ వాక్ అని చెప్పడంలో సందేహం లేదు.
2) బాలకృష్ణ (Balakrishna) :
నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) నిలిచింది. ఇది అటు ఇటులో రూ.80 కోట్ల షేర్ ను రాబట్టింది. అయినప్పటికీ బాలయ్య నటిస్తున్న ‘అఖండ 2’ సినిమాకి ఏకంగా రూ.180 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ‘అఖండ’ (Akhanda) హిట్ అయ్యింది కాబట్టి.. సీక్వెల్ పై అంచనాలు ఉంటాయి. అందుకే నిర్మాతలు ఈ డేరింగ్ స్టెప్ వేస్తున్నట్టు స్పష్టమవుతుంది.
3) మంచు విష్ణు (Manchu Vishnu) :
మోహన్ బాబు (Mohan Babu) పెద్ద కుమారుడు మంచు విష్ణుకి రూ.100 కోట్ల షేర్ సినిమా కాదు కదా కనీసం రూ.25 కోట్ల షేర్ మూవీ కూడా లేదు. అయినప్పటికీ ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఇందులో ప్రభాస్ (Prabhas) , మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్లు ఉన్నారు అనే నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టేస్తున్నారు అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.
4) నాని (Nani) :
నాని సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. అయినప్పటికీ ఇతని కెరీర్లో వంద కోట్ల షేర్ మూవీ లేదు. అయినప్పటికీ ఇతని నెక్స్ట్ సినిమాలు అయినటువంటి ‘పారడైజ్’ అలాగే సిబి చక్రవర్తి (Cibi Chakaravarthi) దర్శకత్వంలో చేస్తున్న సినిమాలకి రూ.100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తుంది.
5) సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) :
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్లో వంద కోట్ల గ్రాస్ కొట్టిన సినిమాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ‘విరూపాక్ష’ (Virupaksha), ఇంకోటి ‘బ్రో’. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ‘బ్రో’ కలెక్షన్స్ ను సాయి ధరమ్ తేజ్ అకౌంట్లో వేయలేము. సో ఇతనికి కూడా వంద కోట్ల షేర్ మూవీ లేదు. కానీ ఇతని నెక్స్ట్ సినిమా ‘సంబరాల యేటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage) కి రూ.140 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ‘హనుమాన్’ (Hanuman) నిర్మాత నిరంజన్ రెడ్డి.
6) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) :
మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంది విజయ్ దేవరకొండ మాత్రమే అనడంలో సందేహం లేదు. ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమా రూ.130 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలా అని అది రూ.100 కోట్ల షేర్ కాదు. దాని తర్వాత ఒక్క సినిమా కూడా దాని స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ అతని నెక్స్ట్ సినిమా ‘కింగ్డమ్’ (Kingdom) కోసం రూ.150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రూపొందుతుంది.
7) నాగ చైతన్య(Naga Chaitanya) :
అక్కినేని నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే ‘తండేల్’ (Thandel) అనే చెప్పాలి. అది రూ.90 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. దీని తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో (Karthik Varma Dandu) ఒక సినిమా చేస్తున్నాడు. దీని బడ్జెట్ వంద కోట్ల పైనే ఉంటుందట. కానీ ఇప్పటివరకు నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల షేర్ మూవీ లేదు.
8) నిఖిల్ (Nikhil) :
నిఖిల్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘కార్తికేయ 2’ Karthikeya 2). సో ఇతని కెరీర్లో కూడా వంద కోట్ల షేర్ మూవీ లేదు. కానీ అతని నెక్స్ట్ మూవీ ‘స్వయంభు’ (Swayambhu) కోసం ఏకంగా రూ.100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారట.
9) అఖిల్ (Akhil Akkineni) :
హీరోగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ 5 సినిమాలు చేశాడు. ఇందులో హిట్ అంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) ఒక్కటే. అది కూడా రూ.25 కోట్ల షేర్ మూవీ. సో ఇతని కెరీర్లో కూడా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. అయినా సరే ‘యూవీ ప్రొడక్షన్స్’ లో అఖిల్ చేయబోయే సినిమాకి రూ.100 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారట.
10) ధనుష్ (Dhanush) :
తమిళ స్టార్ హీరో ధనుష్ కి కూడా రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. కానీ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో చేస్తున్న ‘కుబేర’ (Kubera) సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారట. ఇందులో ధనుష్ పారితోషికమే రూ.50 కోట్ల వరకు ఉన్నట్లు వినికిడి.