పోర్న్ వీడియో రాకెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇదే కేసులో ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది నాయికలు, నటులు ఈ వ్యవహారం గురించి బహిరంగంగానే మాట్లాడారు. అయితే వాళ్లంతా స్టార్లు కారు అనేది వేరే విషయం. ఇలా స్పందించిన వారిలో నటి గెహనా వశిష్ట్ ఒకరు. రాజ్ కుంద్రా వీడియోలు పోర్న్ కాదు అని చెప్పిన గెహనాపై కూడా ఇప్పుడు కేసు నమోదైంది.
ముంబయి చెందిన ఓ నటి.. హాట్‌షాట్స్ అనే యాప్ కోసం కోసం తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదుతో నటి గెహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది. ఆయనకు సపోర్టు చేసినవారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. అశ్లీల చిత్రాలు రూపొందిస్తున్న ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గహనా వశిష్ఠ్ సహా 10 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అందులో భాగంగానే శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను జులై 19న అరెస్ట్ చేశారు. మరోవైపు రాజ్ కుంద్రాకు చెందిన హాట్‌షాట్స్ యాప్, దాని నిర్వాహకులపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!