Allu Arjun: ఐకాన్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఈమేనా?

  • September 7, 2021 / 03:00 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప పార్ట్1లో నటిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుష్ప పార్ట్1 షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప పార్ట్1 తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ మూవీలో నటించనున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్ గా కృతిశెట్టి ఎంపికయ్యారని తెలుస్తోంది. సాధారణంగా బన్నీ సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడానికి ఇష్టపడరు.

అయితే పూజా హెగ్డేకు మాత్రం బన్నీకి జోడీగా నటించే అవకాశం మరోసారి దక్కుతుండటం గమనార్హం. ఇప్పటికే డీజే, అల వైకుంఠపురములో సినిమాల్లో బన్నీ, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో మరోసారి బన్నీ, పూజాహెగ్డే కలిసి నటించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కీలక పాత్రకు కృతిశెట్టి ఎంపికయ్యారు. ఉప్పెన సక్సెస్ తో కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం కృతిశెట్టి రామ్ లింగుస్వామి కాంబో మూవీలో, నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుండగా నార్త్ ఇండియాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. బన్నీ ఈ సినిమాలో అంధుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వేణు శ్రీరామ్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus